కిరాతకం : చంపి ఇంట్లోనే పాతిపెట్టారు

deathహైదరాబాద్ సిటీలో అతి కిరాతక హత్య వెలుగు చూసింది. ఓ యువకుడిని చంపి తల, మొండెం వేరు చేసి మరి ఇంట్లోనే పాతిపెట్టిన వైనం పోలీసులను కూడా షాక్ గురి చేసింది. శరీర అవయమాలను గొయ్యి తీసి.. దాన్ని సిమెంట్ తో ఫ్లోరింగ్ కూడా చేశారు. సంచలనం సృష్టించిన ఈ మర్డర్ కేసు వివరాల్లోకి వెళితే.. కుత్బుల్లాపూర్ మండలం చింతల్ ఏరియాలో ఈ అమానుషం చోటుచేసుకుంది. చంద్రనగర్ లోని 5-2-9 ఇంటి నంబర్ లో మహదేవ్ గుప్త అనే వ్యక్తి ఇంట్లో.. బీహార్ రాష్ట్రానికి చెందిన యువకులు అద్దెకు ఉంటున్నారు. వీళ్లు వారం రోజులుగా రూంకి రావటం లేదు. వీళ్లు బ్యాచిలర్స్. ఈ విషయాన్ని ఎవరూ గమనించలేదు. అయితే ఇంటి పక్కనే ఉండే కొంత మంది బ్యాచిలర్స్ దుర్వాసన రావటాన్ని గమనించారు. ఇంటి ఓనర్ కు సమాచారం ఇచ్చారు. ఓనర్ కంప్లయింట్ తో పోలీసులు రంగంలోకి దిగారు. ఇంటి తాళాలు పగులగొట్టి చూశారు. ఇంటినిండా రక్తపు మరకలు. ఓ గదిలో కొత్తగా ఫ్లోరింగ్ చేసిన ఆనవాళ్లు గుర్తించారు. తవ్వి చూస్తే తల, మొండెం వేరుచేసి ఉన్న శవం బయటపడింది. అతని వయస్సు 35ఏళ్లు ఉంటాయి. ఇంట్లో ఉండే వారే ఇతన్ని చంపి ఉంటారని భావిస్తున్నారు. అద్దెకు తీసుకున్న వారు ఏమయ్యారు.. ఎక్కడున్నారు.. వాళ్లు ఏం పని చేస్తుంటారు అనే విషయాలను ఆరా తీస్తున్నారు. చనిపోయిన వ్యక్తి వివరాలను తెలుసుకునే పనిలో ఉన్నారు పోలీసులు. ఇంట్లో బెంగళూరుకి చెందిన రెండు ఐడీ ప్రూప్ లు, రెండు కత్తులు దొరికాయి. కేసు విచారణలో ఉంది.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy