కిలిమంజారోపై 100 అడుగుల జాతీయ పతాకావిష్కరణ

636208082999636324తెలంగాణకు చెందిన ఏడుగురు విద్యార్థులు ఆఫ్రికాలోకెల్లా అత్యంత ఎత్తయిన కిలిమంజారో పర్వత శిఖరాన్ని సోమవారం (ఆగస్టు-14)అధిరోహించారు. వీరిలో పలు వురు గిరిజన, బీసీ ఆశ్రమ పాఠశాలల విద్యా ర్థులుండటం విశేషం. శిఖరాగ్రాన 100 అడు గుల జాతీయ పతాకాన్ని ఎగురవేసి స్వాతంత్య్ర దినోత్సవ సంబురాలను ఘనంగా జరుపుకున్నారు. సీఎం కేసీఆర్, గిరిజన వీరుడు కొమరం భీంల చిత్రపటాలను ప్రదర్శించారు.

ఈ బృందంలో వనపర్తి సాంఘిక సంక్షేమ పాఠశాలలో పదో తరగతి చదువు తున్న సబావత్‌ సునీత కూడా ఉండటం విశేషం! ఆమెతో పాటు నాయిని మల్లేశ్‌ (ఆసిఫాబాద్‌ గిరిజన ఆశ్రమ పాఠశాల), ఆనంద్‌కుమార్, శ్రీకుమార్, అరుణ్‌ కుమార్‌ (నల్లగొండ), చరణ్‌రాజ్‌ (నాగర్‌కర్నూలు వాసి, కింగ్‌కోఠీ బీసీ సంక్షేమ హాస్టల్‌ డిగ్రీ విద్యార్థి), రాఘవేంద్ర (మహబూబ్‌నగర్‌) బృందంలో ఉన్నారు. ఏపీ నుంచి సత్యారావు (డిగ్రీ విద్యార్థి, బంగారుపాళెం, విశాఖపట్నం), రఘునీథ్‌ (మౌంటెనీరింగ్‌ గైడ్, తాడేపల్లి, గుంటూరు) ఈ బృందంలో ఉన్నారు. పర్వతారోహ ణను విజయవంతంగా పూర్తిచేసిన విద్యార్థు లను సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శి ఆర్‌.ఎస్‌.ప్రవీణ్‌కుమార్‌ అభినందించారు. సీఎం కేసీఆర్‌ చొరవే ఈ విజయానికి కారణమన్నారు. గిరిజన విద్యార్ధులకు అత్యుత్తమ విద్య, అవకాశాలను కల్పిస్తున్న సీఎంకు, గిరిజన సంక్షేమ మంత్రి చందూలాల్‌కు ధన్యవాదాలు తెలిపారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy