వికెట్ కీపర్ నుంచి ఐసీసీ ప్రెసిడెంట్ వరకు

1425287591dalmiyaకీపర్ నుంచి ఐసీసీ అధ్యక్షుడి వరకు ఎదిగిన పట్టుదల ఆయనది.. లాసుల్లో ఉన్న బోర్డును కాసుల బోర్డుగా మార్చిన బిజినెస్ మెన్ ఆయన… భారత క్రికెట్ లో 35 ఏళ్లకు పైగా కీలక పాత్ర  పోషించిన జగ్ మోహన్ దాల్మియా… వరల్డ్ క్రికెట్ లో బీసీసీఐని పెద్దన్నగా డెవలప్ చేశారు. చివరి వరకు క్రికెటే శ్వాసగా జీవించారు.

ఇండియన్ క్రికెట్ తో ఆయనది విడదీయరాని బంధం. వికెట్ కీపర్ నుంచి, ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడి వరకు.. జగ్ మోహన్ దాల్మియా సాగించిన ప్రయాణం అనితర సాధ్యం. ప్రపంచంలోని వివిధ దేశాల క్రికెట్ బోర్డులకు దిశానిర్దేశం చేసే ఐసీసీని కూడా.. శాసించే సత్తా బీసీసీఐకి ఉందంటే అది దాల్మియా చలవే. ప్రపంచంలోనే అత్యంత ధనిక బోర్డుగా బీసీసీఐని తయారు చేసింది కూడా దాల్మియానే. తన ప్రయాణంలో ఎన్నో అప్ అండ్ డౌన్స్ చూసిన దాల్మియా.. చివరికి క్లీన్ చిట్ తో బయటికొచ్చారు.

97159క్రికెట్ దాల్మియాకు మూడున్నర దశాబ్దాల అనుబంధం. 1979లో బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ లోకి ఎంటరై.. 1983లో బీసీసీఐ ట్రెజరర్ అయ్యారు. 1990లో సింగిల్ ఓటు మెజార్టీతో BCCI సెక్రటరీగా ఎన్నికయ్యారు. 1993-94, 1996-97ల్లో మరోసారి బోర్డు సెక్రటరీ గా ఎన్నికైన దాల్మియా… 1997లో ICC ప్రెసిండెంట్ గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 2000 సంవత్సరం దాకా ICC అధ్యక్షుడిగా కొనసాగారు. 2001లో BCCI అధ్యక్షుడిగా ఎన్నికై… 2004వరకు కొనసాగారు.

2000 సంవత్సరంలో టీవీ రైట్స్ వివాదంలో దాల్మియాపై ఆరోపణలొచ్చాయి. 2005 లో బీసీసీఐ పగ్గాలు శరద్ పవార్ చేపట్టారు. ఆ తర్వాత దాల్మియాపై నిధుల దుర్వినియోగం ఆరోపణలు రావటంతో ఆయన్ను బోర్డు నుంచి బయటకు పంపారు. తర్వాత కొన్నాళ్ళ పాటు కోర్టులో పోరాటం చేసిన దాల్మియాకు.. 2007 లో కోల్ కతా హైకోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది. అంతేకాదు… క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ కు అధ్యక్షుడిగా పోటీ చేసేందుకు అనుమతి కూడా ఇచ్చింది. దాంతో మళ్ళీ ఆయన బెంగాల్ బోర్డు ప్రెసిడెంట్ గా ఎన్నికై… BCCIలో అడుగుపెట్టారు. 2013 జూన్ లో IPL  మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలతో ఎన్.శ్రీనివాసన్ BCCI అధ్యక్ష పదవి నుంచి తప్పుకోవడంతో… టెంపపరీ ప్రెసిండెంట్ గా బాధ్యతలు చేపట్టారు. 1987, 1996లో… భారత ఉపఖండంలో క్రికెట్ వరల్డ్ కప్ నిర్వహించటంలో.. దాల్మియా పాత్ర కీలకం. 1990లో బీసీసీఐ కార్యదర్శిగా దాల్మియా బాధ్యతలు చేపట్టే నాటికి.. బోర్డు 82 లక్షల రూపాయల లోటు బడ్జెట్ లో ఉంది. ఆ తర్వాత ఏడాదిలోనే 100 కోట్లకు పైగా టర్నోవర్ సాధించి.. ప్రపంచంలోనే ధనిక బోర్డుగా ఆవిర్బవించిందంటే దాల్మియా మార్కెటింగ్ వ్యూహాలను అర్థం చేసుకోవచ్చు. చివరికంటూ క్రికెట్టే శ్వాసగా జీవించిన దాల్మియా.. బీసీసీఐ ప్రెసెడెంట్ గా కొనసాగుతూనే చనిపోయారు.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy