కీరవాణి రిటైర్మంట్

keeravaniమెలోడీ మెస్ట్రో కీరవాణి అందరికీ షాక్ ఇచ్చారు. తన జీవితంలో కీలక నిర్ణయాన్ని వెల్లడించారు. తాను 2016 డిశంబర్ 8 న రిటైర్ అవుతానంటూ ప్రకటన చేశారు. 1989… డిసెంబర్ 9. కీరవాణి జీవితానికి టర్నింగ్ పాయింట్. చక్రవర్తి దగ్గర శిష్యరికం చేసిన ఆయనకు సంగీతదర్శకుడిగా తొలి అవకాశం. ఎన్నో ఆశలు.. ఎన్నో కలలు. అవన్నీ నెరవేరే క్షణం. చెన్నయ్‌లోని ప్రసాద్ స్టూడియో దానికి వేదిక. తొలి పాట రికార్డ్ అయ్యింది. ఓ పక్క అంబరాన్నంటే సంబరం. మరోపక్క మనసులో ఒక విచిత్రమైన ఆలోచన. సరిగ్గా 27 ఏళ్ల తర్వాత ఇదే రోజున సంగీతదర్శకుడిగా రిటైర్ కావాలి. తన భవిష్యత్తేంటో తెలియదు. తనేం సాధిస్తాడో తెలియదు. అయినా రిటైర్‌మెంట్ గురించి ఆలోచన. సరే అప్పుడు అనుకున్నారనే అనుందాం. కానీ ఆయన అనుకోవడమే కాదు దాన్ని ఇన్నేళ్ళ తర్వాత కూడా గుర్తుపెట్టుకున్నారు. రీసెంట్ గా రెండు రోజుల క్రితం ఫేస్ బుక్ లో తన నిర్ణయాన్ని పోస్ట్ చేసేశారు. మొదట అందరూ కీరవాణి వూరికే చెబుతున్నారులే అనుకున్నారు. కానీ తర్వాత అందులోని సీరియెస్ ని అర్ధం చేసుకున్నారు.

తెలుగు చిత్రసీమలో ఆయన నంబర్‌వన్ మ్యూజిక్ డెరైక్టర్. మరో పది, పదిహేనేళ్లయినా రాణించగల సత్తా కీరవాణిలో ఉంది. అలాంటి ఆయన సడన్‌గా ఈ ప్రకటన చేయడంతో అందరూ విస్తుపోయారు.  ‘‘నా రిటైర్‌మెంట్ డేని పలువురు సంగీతదర్శకులు, నాకు బాగా దగ్గరైన నా అసోసియేట్స్‌తో సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటున్నాను. నా తొలి పాట రికార్డ్ అయిన ప్రసాద్ స్టూడియోలోనే జరుపుకోవాలనుకుంటున్నాను. ఈరోజు రావడానికి మరో మూడేళ్లు ఉంది. ఇన్నేళ్లుగా తమ ఇష్టాయిష్టాలను, సలహాలను, సూచనలను ఇచ్చిన నా అభిమానులకు ధన్యవాదాలు’’ అని కీరవాణి ‘ఫేస్‌బుక్’ ద్వారా వెల్లడించారు.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy