కీలక మంత్రి పదవులపై జేడీఎస్-కాంగ్రెస్ ల మధ్య క్లారిటీ

KARకర్ణాటకలో జేడీఎస్, కాంగ్రెస్ ల మధ్య కీలక మంత్రి పదవులపై అవగాహన కుదిరింది. జేడీఎస్ కు ఆర్ధికశాఖ ఇచ్చేందుకు కాంగ్రెస్ అంగీకరించింది. కాంగ్రెస్ కు హోంశాఖ దక్కింది. కొన్నిరోజులుగా కీలక మంత్రిత్వ శాఖలపై కాంగ్రెస్, జేడీఎస్ ల మధ్య చర్చలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఆర్ధికశాఖను ఎట్టిపరిస్ధితుల్లో వదులుకోవడానికి జేడీఎస్ సిద్దంగా లేదని అమెరికా పర్యటనలో ఉన్న రాహుల్ గాంధీ తో సీఎం కుమారస్వామి చెప్పినట్లు సమాచారం. దీంతో రాహుల్ సూచన మేరకే కాంగ్రెస్ కు హోంశాఖ దక్కింది.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy