కుక్క చనిపోతే.. ఊరు ఊరంతా ఏడ్చిందా..?

ali appuఅలీ అప్పు మరణంతో ఆ ఊరంతా శోకసంద్రంలో మునిగిపోయింది. ఏ ఇంటి దగ్గర చూసినా నల్ల జెండాలు కనపడతున్నాయి. పెద్ద పెద్ద బ్యానర్లతో శ్రద్ధాంజలి ఘటిస్తున్నారు. అప్పూ దూరమైనందుకు వారు పడుతున్న బాధ అంతా ఇంతా కాదు. ఎవరిని కదిలించినా.. విషాద వదనమే. ఇంతకూ అలీ అప్పు.. ఎవరో చెప్పలేదు కదూ… తనో గ్రమాసింహం. కేరళ కోజికోడ్ జిల్లాలోని కుంజిపల్లి గ్రామస్థులకు అత్యంత ఆత్మీయనేస్తం. సెప్టెంబర్ 8న తను కన్నుమూసింది. అయితే అది సహజ మరణం కాదు. దారుణంగా దాడి చేసి చంపేశారు. తీవ్ర గాయాలపాలైన అప్పు.. గత శుక్రవారం కన్నుమూసింది. అప్పటి నుంచి ఆ ఊళ్లో అందరూ విషాదంలో మునిగిపోయారు. గ్రామమంతటికీ రక్షణ కవచంగా ఉండే తమ అప్పు లేని లోటు పూడ్చలేనిదంటూ కన్నీళ్ల పర్యంతమవుతున్నారు.

అప్పు మరణించినప్పటి నుంచి కొంతమంది అన్నం కూడా తినడం మానేశారు. అప్పుకు నివాళులు అర్పిస్తూ ప్రతి ఇంటిపైనా నల్ల జెండాలు ఎగరేశారు. అంతేకాదు కొంతమంది బ్యానర్లు కూడా ఏర్పాటు చేశారు. దీనిబట్టి అర్థం చేసుకోవచ్చు అదెంటే ఎంత ప్రేమో. పిల్లలు చదువుకోవడానికి వెళుతుంటే వాళ్లకు తోడుగావెళ్లేది. ఎవరైనా కొత్త వాళ్లు వస్తే…. అందరనీ అలర్ట్ చేసేది. అలాంటి అప్పును దుర్మార్గులు దారుణంగా చంపేశారని వాపోతున్నారు. నిందితులను పట్టుకుని కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy