కుట్రలు కొనసాగుతున్నాయి, తస్మాత్ జాగ్రత్త!

yan

తెలంగాణా పై సీమాంధ్ర మీడియా, నాయకుల కుట్రలు కొనసాగుతూనే ఉన్నాయి. రెండు మూడు రోజులుగా జాతీయ మీడియాలో తెలంగాణా ప్రక్రియ, బిల్లు రూపు రేఖలు, నిజంగానే లోపాలు ఉన్నాయా, లేవా, ఇంకా ప్రక్రియ రాజ్యాంగ బద్దంగా జరగడం లేదన్న రకరకాల వాదనలపై వచ్చిన విశ్లేషణ లను, వార్తలను వేటినీ పట్టించుకోలేదు సీమాంధ్ర లాబీ. నిన్న ఒక ఆంగ్ల పత్రికలో మాత్రమె వచ్చిన ఓ వార్త, ఎక్కడ్నించి పుట్టిందో కూడా తెలియని సమాచారాన్ని ఆధారంగా చేసుకుని మండలిలో యనమల సీమాంధ్ర కు అన్యాయం జరుగుతున్న విషయం, బిల్లు లోపాలను కేంద్రం గుర్తించిందని, వీటిపై రెండు మూడు రోజుల్లో సవరణలు పంపించనుందనీ సభకు, ప్రజలందరికీ నమ్మకంగా చెప్పారు. చర్చ కోసం పట్టు పట్టడం ఆంధ్రా కు ఘోర అన్యాయమన్నట్లు ఆయన బాధ పడ్డారు. కేంద్రమే గుర్తించిన అన్యాయాన్ని, తెలంగాణా సోదరులు గుర్తించాలని వాపోయారు. తెలంగాణా ప్రజ కూడా నమ్మేంత విశ్వసనీయంగా సాగింది ఈ వాదన.

కానీ దీనిలో నిజమెంతో నిన్న సాయంత్రానికే తేలిపోయింది. కేంద్ర హోం శాఖ నుండి రాష్ట్ర చీఫ్ సెక్రెటరీకి వచ్చిన లెటర్ ప్రకారం బిల్లు ముసాయిదాయేననీ, లోపాల గురించి, సవరణల గురించి ఆందోళన పడాల్సిన అవసరం రాష్ట్ర అసెంబ్లీకి లేదని, బిల్లు లక్ష్యాలు, ఆర్ధిక వివరణలు కూడా అసెంబ్లీకి అవసరం లేదని, ఇవన్నీ పార్లమెంట్ పరిదిలోనివేనని కరాఖండీగా చెబుతూ, ఎలాంటి వివరణలు కేంద్రం నుండి అసెంబ్లీకి రావడం లేదని తేల్చి చెప్పింది. 23 తర్వాత అసెంబ్లీ చర్చ తో సంబంధం లేకుండా బిల్ పార్లమెంటులో ప్రవేశ పెట్టడం తథ్యం అని అద్వానీ కూడా తేల్చేసారు.

నిన్న అన్యాయం అంటూ గొంతు చించుకున్న ఆంధ్రా మీడియాగానీ, సమ న్యాయం, సమాంతర న్యాయం అని పొలి కేకలు పెట్టె సీమాంధ్ర నాయకులు గానీ ఇవ్వాళ్ళ ఎలాంటి కొత్త కుట్రలకు తెర లేపుతారో చూడాలి.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy