కుమారస్వామి బలపరీక్ష ఇవాళే

hd-kumaraswamy కర్ణాటక అసెంబ్లీలో సీఎం కుమారస్వామి  ఇవాళ   బల పరీక్షను ఎదుర్కోనున్నారు. కాంగ్రెస్, జేడీఎస్ ఇరు పార్టీల ఎమ్మెల్యేలను కలిపితే కూటమి వద్ద 117 ఎమ్మెల్యేలున్నారు. స్పీకర్‌ ఎంపిక తర్వాత ఈ ఎన్నిక జరగనున్నందున సభలో ఉండే మొత్తం ఎమ్మెల్యేల సంఖ్య ఆధారంగా బలపరీక్షలో గెలిచేందుకు 111 మంది మద్దతు అవసరం. దీంతో చివరి నిమిషంలో రాజకీయాలు చోటుచేసుకుంటేతప్ప కూటమి సర్కారు ‘పరీక్ష’లో నెగ్గటం దాదాపు ఖాయంగానే కనబడుతోంది. కుమారస్వామితో పాటు కాంగ్రెస్‌ నేతలు కూడా ఇదే నమ్మకంతో ఉన్నారు. సుప్రీంకోర్టు నిబంధనల మేరకు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన 48 గంటల్లో బల పరీక్షను ఎదుర్కోవాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే కన్నడ అసెంబ్లీలో ఇవాళ విశ్వాస పరీక్ష జరగనుంది.

విశ్వాస పరీక్షను ‘సంకీర్ణం’ సీరియస్‌గా తీసుకుంది. మొత్తం బలనిరూపణ ప్రక్రియ పూర్తయ్యేంత వరకు ‘ఆపరేషన్‌ కమల’ నుంచి తమ ఎమ్మెల్యేలను కాపాడుకుంటోంది. అందుకే కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు ఇంకా హోటల్‌ గదుల్లోనే ఉన్నారు. కొందరు ఎమ్మెల్యేలు కూటమికే ఓటేస్తామని, ఇళ్లకు వెళ్లేందుకు అవకాశం ఇవ్వాలని చెప్పినప్పటికీ వారిని హోటల్‌ నుంచి పంపేందుకు కాంగ్రెస్‌ రాష్ట్ర నాయకత్వం విముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం. అటు జేడీఎస్‌ ఎమ్మెల్యేలు కూడా నగరంలోని మరో హోటల్‌లోనే ఉన్నారు. వారిని కూడా ఇళ్లకు పంపేందుకు ఆ పార్టీ నేతలు అంగీకరించనట్లు తెలిసింది.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy