కురిసే… కురిసే.. నేలంతా తడిసే

40e1444c8fa4b983dcf7ebd830c9bec6తెలుగు నేలకు తొలకరి పలకరింపులు

వానజల్లుళ్లతో మురుస్తున్న పంట భూములు

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న నైరుతి రుతుపవనాలు తెలుగు రాష్ట్రాల్లోకి ఎంట్రీ ఇచ్చాయి. 48 గంటల క్రితమే రుతుపవనాలు రాయలసీమలోని అనంతపురం జిల్లాలోకి ప్రవేశించాయి. దీంతో రాష్ట్రంలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. 50 శాతానికి పైగా ప్రాంతాల్లో వర్షాలు పడినట్లు వాతావరణశాఖ తెలిపింది. మూడ్రోజుల తర్వాత రుతుపవనాల ప్రభావం తగ్గనుంది. ఇక రెండ్రోజులుగా హైదరాబాద్ లో కురుస్తున్న వర్షాలకు రోడ్లపైకి మోకాళ్ల లోతు నీళ్లు చేరాయి. రంగారెడ్డి జిల్లా సరూర్ నగర్ లో నిన్న 135.2 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది.  101 ఏళ్ల రికార్డును బ్రేక్ చేసింది. సరూర్ నగర్ లో దాదాపు 14 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డైంది. 1914 జూన్ 24న ఇక్కడ 122.7 మిల్లీమీటర్ల వర్షం కురిసింది.

అటు కరీంనగర్ జిల్లా సుల్తానాబాద్ లో 8 సెం.మీ., నిజామాబాద్ జిల్లా మద్నూర్, ఆర్మూర్ లలో 7 సెం.మీ. వర్షపాతం నమోదైంది. చేవెళ్ల, వేల్పూర్, మిర్యాలగూడలలో 6 సెం.మీ.; హయత్ నగర్, నారాయణఖేడ్, హకీంపేట్ లలో 5 సెం.మీ. వర్షం కురిసింది. నందిపేట్, నవీపేట్, జుక్కల్, జక్రాన్ పల్లి, బాల్కొండల్లో 4 సెం.మీ. చొప్పున కురిసినట్లు ఐఎండీ చెప్పింది.

రుతుపవనాల రాకతో రైతులు వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు. ఇప్పటికే వ్యవసాయ క్షేత్రాలను కూడా సిద్ధం చేశారు. విత్తనాలు, ఎరువుల కోసం డీలర్ల వద్దకు పరుగులు తీస్తున్నారు. వ్యవసాయ శాఖ యంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది. విత్తనాలు, ఎరువులు సకాలంలో రైతులకు అందించే ఏర్పాట్లు చేసింది. సాధారణంగా జూన్ 10 నాటికి రుతుపవనాలు తెలంగాణలోకి ప్రవేశిస్తాయని… ఆ ప్రకారమే కొంచెం అటూ ఇటుగా 13న  ప్రవేశించాయని బేగంపేట వాతావరణశాఖ తెలిపింది.

మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్ గఢ్ లోనూ రుతుపవనాలు విస్తరించాయని ఐఎండీ అధికారులు తెలిపారు.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy