కురుక్షేత్ర యుద్ధానికి నంద్యాల నాందీ : జగన్

jganనంద్యాలలో జరుగుతున్నది ఉప ఎన్నిక మాత్రమే కాదని ధర్మయుద్ధమని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షుడు వైస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి అన్నారు. ధర్మానికి అధర్మానికి, న్యాయానికి అన్యాయానికి మధ్య జరుగుతున్న యుద్ధమని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి కేబినెట్‌ మొత్తం కూడా నడి నంద్యాలలో ఉందన్నారు. చంద్రబాబు ఎంపీలు, పెద్ద పెద్ద నాయకులు ఇక్కడే తిష్ట వేశారని, చివరకు చంద్రబాబు, ఆయన కొడుకు నంద్యాల రోడ్ల మీద తిరుగుతున్నారని ధ్వజమెత్తారు. నంద్యాల ఉప ఎన్నిక సమరం నేపథ్యంలో గురువారం వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎస్పీజీ గ్రౌండ్‌లో ఏర్పాటుచేసిన బహిరంగ ప్రచార సభలో వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి మాట్లాడారు. ‘అబద్ధాలు చెబుతూ మోసపూరిత జీవోలు ఇస్తూ అబద్ధపు వాగ్దానాలు చంద్రబాబు నాయుడు చేస్తున్నారు.

కారణం ఈ ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ పోటీలోకి అభ్యర్థిని దింపింది కాబట్టి ఇలా చేస్తున్నారు. కుట్రలు, కుయుక్తులు ఎక్కువయ్యాయి. మనం పోటీలో ఉన్నాం కాబట్టే ఇవాళ చంద్రబాబు వారి కేబినెట్‌, ఆయన కొడుకు నడి రోడ్డుపై కనిపిస్తున్నారు. ఒక వేళ మనం (వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ) నంద్యాల ఎన్నిక ఏకగ్రీవం అని ఉంటే చంద్రబాబు నంద్యాలకు ఒక్క రూపాయి అయినా విదిల్చేవాడా? నంద్యాలకు ఒక్క పథకం ఇచ్చేవాడా? ఇంతమంది మంత్రులు నంద్యాల నడిరోడ్డుపై కనిపించేవారా? అందరికీ తెలుసు ఇవన్నీ కూడా ఎందుకు జరుగుతున్నాయో? నంద్యాల ప్రజలకే కాదు.. ఈ జిల్లాలో ఉన్న పక్క నియోజకవర్గాల ప్రజలకు తెలుసు? ఎవరు అమ్ముడుపోయారో వారి నియోజవర్గ ప్రజలకు కూడా తెలుసు. ఉప ఎన్నికల్లో ఎప్పుడు వైఎస్‌ఆర్‌సీపీ పోటీ పెడితే అప్పుడు చంద్రబాబు నిద్రలేస్తారు. అని ఎద్దేవా చేశారు జగన్.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy