కుర్రకారుకు హుషారైన వార్త : తగ్గనున్న బైక్స్ ధరలు

bikeకుర్రకారు హుషారైనా వార్త ఇది. నిన్నటి వరకు ఓల్డ్ స్టాక్ వదిలించుకునేందుకు భారీ ఆఫర్స్ ఇచ్చిన బైక్స్ కంపెనీలు.. ఇప్పుడు GST పరిధిలోకి వచ్చిన తర్వాత అదే తగ్గింపునకు విక్రయాలు సాగించనున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో బైక్స్ పై 30 నుంచి 32శాతం వరకు బైక్స్ పై ట్యాక్స్ ఉంది. GST పరిధిలో అది 28శాతం స్లాబ్ లోకి వచ్చింది. అంటే ఒక్కో బైక్ పై కనీసంగా 2 నుంచి 3శాతం వరకు తగ్గనుంది. అంటే రూ.50వేల బైక్ ఉంటే.. కనీసంలో కనీసం వెయ్యి తగ్గనుంది. ఆయా బైక్స్ మోడల్, ధరను బట్టి ఇది ఉంటుంది.

హీరో మోటార్స్ :

హీరో మోటార్స్ కంపెనీ బైక్స్ అయిన స్ల్పైండర్, ఫ్యాషన్, కరిజ్మా, గ్లామర్, మ్యాస్ట్రో, ఫ్లెజర్ వాహనాలు ధరలపై ఇప్పటి వరకు 30.2శాతం ఉన్న పన్ను.. GSTలో 28శాతంగా ఉంది. అంటే ఒక్కో బైక్ పై ఆయా బండి ధరను బట్టి కనీసం వెయ్యి నుంచి గరిష్టంగా రెండు వేల రూపాయల వరకు తగ్గనుంది.

సుజుకీ మోటార్స్ :

యాక్సెస్, హయతే, గిక్సర్ రేంజ్, లెట్స్ బైక్స్ ధరలు వెయ్యి నుంచి రెండు వేల 500 వరకు తగ్గనున్నాయి.

హోండా మోటార్స్ :

యాక్టివా, డియో, ఏవిచేటర్, క్లిక్, యునికార్న్, డ్రీమ్ సిరీస్ బైక్స్ ధరలు కూడా దిగిరానున్నాయి. ఇప్పటి వరకు 30-31శాతంగా ఉన్న పన్ను GSTలో 28శాతానికి పరిమితం అయ్యింది. దీంతో వెయ్యి నుంచి 5వేల రూపాయల వరకు ధర తగ్గే అవకాశం ఉంది.

బజాజ్ ఆటో మోటార్స్ :

పల్సర్, డిస్కవర్, ప్లాటినా, అవేంజర్, డ్యూక్ 200, KTM ఆర్సీ బైక్స్ ధరలు వెయ్యి నుంచి 6వేల రూపాయల వరకు ధరలు తగ్గనున్నాయి.

యమహా మోటార్స్ :

FZ, R15, FZ25, ఆల్ఫా, SZ బైక్స్ ధరలు స్వల్పంగా తగ్గనున్నాయి. ఒక్కో బైక్ పై వెయ్యి నుంచి 2,500 రూపాయలు తగ్గనున్నాయి.

ఈ తగ్గింపు ధరలు 300 సీసీ హార్స్ పవర్ లోపు ఉండే టూవీలర్స్ పై మాత్రమే. బైక్ సీసీ 300 హార్స్ పవర్ కంటే ఎక్కువ ఉంటే 31శాతం పన్ను విధిస్తారు. గతం కంటే ఇది ఒక శాతం అధికం. కాకపోతే దేశంలో అమ్ముడుపోయే 95శాతం వాహనాలు 300 సీసీ కంటేలోపు ఉన్నవే. ఏయే కంపెనీ ఏయే బైక్ పై ఎంతెంత ధర తగ్గించనుందో అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.

 

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy