కుల్గాంలో కాల్పులు: ఇద్దరు ఉగ్రవాదులు హతం

దేశ సరిహద్దు ప్రాంతం మరోసారి తుపాకీల మోతలతో దద్దరిల్లింది. జమ్మూకశ్మీర్‌‌లోని కుల్గాం జిల్లా కటపోర ప్రాంతంలో భద్రతా బలగాలకూ, ఉగ్రవాదులకు మధ్య శనివారం సాయంత్రం కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. మరో ముగ్గురు ఉగ్రవాదులు కూడా కటపోర ప్రాంతంలోనే ఉన్నట్లుగా తెలియడంతో ఏరియా మొత్తాన్ని తమ అధీనంలోకి తీసుకున్న భద్రతా దళాలు… ఆ ప్రాంతాన్ని బలగాలు జల్లెడ పడుతున్నాయి. ఉగ్రవాదుల ఏరివేతకు సిద్ధమయ్యాయి. ప్రస్తుతం రెండు వర్గాల మధ్య కాల్పులు కొనసాగుతూనే ఉన్నాయి.

జమ్మూకశ్మీర్‌లోని నౌషేరా లో శుక్రవారం ఉగ్రవాదులు అమర్చిన ఐఈడీ పేలుడులో ఆర్మీ మేజర్ శశిధరణ్ వి నాయర్ తో పాటు ఓ జవాను వీరమరణం పొందినట్టు ఆర్మీ ప్రతినిధి తెలిపారు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy