కూతకు రెడీ : కబడ్డీ.. కబడ్డీ.. కబడ్డీ..

seasion 5 Pro-Kabaddiసిటీలోని గచ్చిబౌలీ స్టేడియంలో ‘ప్రొ కబడ్డీ’ ఐదో సీజన్ జూలై 28వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. కొత్తగా 4 జట్లు చేరడంతో జట్ల సంఖ్య 12కి చేరింది. 13 వారాల పాటు 138 మ్యాచ్ లతో ప్రొ కబడ్డీ ఐదో సీజన్ కి రెడీ అయ్యింది. అక్టోబరు 28న ఫైనల్స్ మ్యాచ్ ఉంటుంది.

ప్రొ కబడ్డీ సీజన్ 5 ఓపెనింగ్ కు హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియం వేదిక అయ్యింది. ఇందులో టాలీవుడ్, బాలీవుడ్ సినీ తారలు సందడి చేయనున్నారు. సాయంత్రం 6 నుంచి ఏడున్నర గంటల వరకు ఆర్భాటంగా వేడుకలు జరుగనున్నాయి. సాంస్కృతిక కార్యక్రమాలు, యాక్టర్స్ డ్యాన్స్ లు అభిమానుల్ని అలరించనున్నాయి. బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్  జాతీయ గీతం పాడనున్నారు. సచిన్  టెండుల్కర్ , మిథాలీ రాజ్ , పుల్లెల గోపీచంద్, కిదాంబి శ్రీకాంత్, చిరంజీవి, రానా దగ్గుబాటి, అల్లు అర్జున్, రామ్ చరణ్  ఓపెనింగ్ సెర్మనీలో పాల్గొంటారు. రాత్రి 8 గంటలకు ఫస్ట్ మ్యాచ్ లో తెలుగు టైటాన్స్.. తమిళ్ తలైవాస్ తో తలపడనుంది.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy