కూనలపై కష్టంగా : 26 పరుగుల తేడాతో టీమిండియా విక్టరీ

ఆసియా కప్‌లో భారత్‌ గెలుపు నమోదు చేసింది. మంగళవారం(సెప్టెంబర్-18)  గ్రూప్‌-Aలో హాంకాంగ్‌ తో జరిగిన మ్యాచ్ లో  26 పరుగుల తేడాతో భారత్‌ విజయం సాధించింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 285 పరుగులు చేసింది. ఇంగ్లండ్‌తో టెస్టుల్లో ఘోరంగా విఫలమై తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న శిఖర్‌ ధావన్‌ మరోసారి తనకు అచ్చొచ్చిన వన్డే ఫార్మాట్‌కు వచ్చేసరికి చెలరేగిపోయాడు. ధవన్ 120 బంతుల్లో… 15 ఫోర్లు, 2 సిక్సర్లతో 127 పరుగులు చేసి సత్తా చాటాడు.

286 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన హాంకాంగ్….50 ఓవర్లలో 259/8 స్కోరు మాత్రమే చేయగలిగింది. ఓపెనర్‌ నిజాకత్‌ ఖాన్‌ (92), అన్షుమన్‌ రథ్‌ (73)  హాఫ్ సెంచరీ చేశారు. ఈ మ్యాచ్ లో హాంకాంగ్ ఆటగాళ్లు భారత్ కు ముచ్చెమటలు పట్టించారు. ఒక దశలో హాంకాంగ్ విక్టరీ కొడుతోందేమోనని అందరూ భావించారు.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy