కూరగాయల మార్కెట్లలో ‘జీరో వేస్టేజ్ మెషీన్లు’

రాష్ట్రంలో ఎన్నో కూరగాయల మార్కెట్లు ఉన్నాయి. హైదరాబాద్ లో వెజిటబుల్ మార్కెట్లకు వచ్చే సరుకు భారీస్థాయిలో ఉంటుంది. ఈ కూరగాయల్లో వేస్ట్ అయిపోయినవాటిని పక్కన పడేస్తుంటారు. వాటినుంచి మురుగు, దోమలు, కీటకాలు వ్యాపిస్తుంటాయి. స్వచ్ఛ సర్వేక్షణ్ లో భాగంగా జీహెచ్ఎంసీ సిటీ మార్కెట్లలో జీరో వేస్టేజ్ మెషీన్లను ఏర్పాటుచేస్తోంది. లేటెస్ట్ గా లింగంపల్లి వెజిటబుల్ మార్కెట్ లో మెషీన్లు పెట్టారు. ఈ మార్కెట్ లో రోజుకు పది టన్నుల వేస్టేజీ తయారవుతుంది. ఈ మెషీన్ వచ్చింది కదా..  ఇకనుంచి జీరో వేస్టేజ్ ఉంటుందంటున్నారు అధికారులు. పాడైపోయిన కూరగాయలను కంపోస్ట్ గా మార్చుతాయి ఈ మెషీన్లు. వీటిని ఎరువుగా వాడుకోవచ్చు. స్వచ్ఛభారత్ మిషన్ లో భాగంగా స్వచ్ఛ హైదరాబాద్ లక్ష్యంతో అన్ని వెజిటబుల్ మార్కెట్లలో ఈ మెషీన్లను అందుబాటులోకి తెస్తున్నారు అధికారులు. జీహెచ్ఎంసీ వెస్ట్ జోన్ కమిషనర్ హరిచందన ఈ వివరాలను ట్విట్టర్ లో పంచుకున్నారు.

 

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy