కూలిన రెండంతస్తుల పాత బిల్డింగ్ – ఇద్దరి మృతి

buildingఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలతో సికింద్రాబాద్ చిలకలగూడలో రెండంతస్తుల బిల్డిండ్ కూలిపోయింది. భవనం గ్రౌండ్ ఫ్లోర్ లో చికెన్ షాప్ నడుపుతున్న యజమాని అక్బర్, వర్కర్ వాజిద్ లు షాప్ మూసివేసే సమయంలో బిల్డింగ్ ఒక్క సారిగా కూలడంతో వారు శిథిలాల కింద చిక్కుకుపోయారు. స్థానికులు వెంటనే స్పందించి శిధిలాలను తొలగించేందుకు ప్రయత్నించినా… వీలుకాకపోవడంతో వారు స్పాట్ లోనే చనిపోయారు.

కూలిన బిల్డిండ్ ను 1940 లో నిర్మించారు. ఈ బిల్డింగ్ గ్రౌండ్ ఫ్లోర్ లో చికెన్ షాప్, జిరాక్స్, హెయిర్ సెలూన్ షాప్ లు ఉన్నాయి. బిల్డింగ్ శిథిలావస్థకు చేరుకోవడంతో పైన ఫ్లోర్లలో ఉంటున్న ఫ్యామిలీస్ ఖాళీ చేసి వెళ్లిపోయారు. అయితే గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న షాప్ లు మాత్రం అలాగే ఉన్నాయి. గతేడాదే బిల్డింగ్ కూల్చేయాలంటూ యజమానికి జీహెచ్ఎంసీ నోటీసులిచ్చింది. అయితే డిమోలిష్ చేసేందుకు కొంత టైం కావాలంటూ ఓనర్ స్టే తెచ్చుకోవడంతో పనులు నిలిచిపోయాయి.

బిల్డింగ్ కూలిందన్న సమాచారంతో వెంటనే పోలీసులు ఇతర అధికారులతో స్పాట్ కు చేరుకున్నారు మంత్రి పద్మారావు, డిప్యూటీ మేయర్ ఫసియుద్దీన్. ఘటనా స్థలంలో రెస్క్యూ పనులను పర్యవేక్షించారు. రీసెంట్ గా గత గురువారం బిల్డింగ్ యజమానికి మళ్లీ నోటీసులిచ్చామన్నారు మంత్రి. ఈ వారంలో కూల్చివేద్దామనుకునేసరికి ఈ సంఘటన జరిగిందన్నారు.  ఈ వారంలో షాపులు ఖాళీ చేద్దామనుకున్నామనీ… కానీ ఇంతలోనే భవనం కూలిపోయిందన్నారు మిగిలిన దుకాణాల యజమానులు. తమ కళ్ల ముందే బిల్డింగ్ కూలిపోయిందన్నారు స్థానికులు. శిథిలాలను తొలగిస్తున్న అధికారులు… బిల్డింగ్ పూర్తిగా పడగొడుతున్నారు. నగరంలో కాలం చెల్లిన పాత బిల్డింగ్ లను వెంటనే కూల్చివేస్తామన్నారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy