కూల్ జర్నీ : రోడ్డెక్కిన వజ్ర బస్సులు

busవజ్ర బస్సులను ప్రారంభించారు సీఎం కేసీఆర్. వజ్ర ఏసీ మినీ బస్సులు, మినీ పల్లెవెలుగు, నాన్ ఏసీ బస్సులతో పాటు.. రాజధాని, సూపర్ లగ్జరీ, బయో డిజిల్ తో నడిచే గరుడ ప్లస్ సర్వీసులను ప్రగతిభవన్ నుంచి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆర్టీసీకి అండగా ఉంటామన్నారు. ఆర్టీసీ నష్టాల్లో ఉన్నా కార్మికులకు 44 శాతం ఫిట్ మెంట్  పెంచుకున్నామని… ఆర్టీసీకి బడ్జెట్ లో వెయ్యి కోట్లు కేటాయించామని తెలిపారు. మిగిలిన ఏ రాష్ట్రంలో లేని విధంగా.. ఒక్క హైదరాబాద్ లో 3 వేల బస్సులు నడుస్తున్నాయన్నారు. 4 వేల మందిని రెగ్యులరైజ్ చేశామని తెలిపారు. మన రాష్ట్ర పథకాలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు.

నో ప్రాఫిట్- నో లాస్ పేరుతోని  అన్ని రూట్లలో  303 బస్సులు నడపనుంది టీఎస్ ఆర్టీసీ.  ఇందులో 60 వజ్ర ఏసీ మినీ బస్సులు, 50 పల్లెవెలుగు నాన్ ఏసీ బస్సులు, 40 రాజధాని ఏసీ బస్సులు, 149 సూపర్ లగ్జరీ బస్సులు, 2 ఎక్స్ ప్రెస్, 2 గరుడ బస్సులున్నాయి. వీటితో పాటు దేశంలోనే మొదటిసారిగా మొబైల్ యాప్ సాయంతో..బస్సు టికెట్ల రిజర్వేషన్ చేసుకునే యాప్ ను  కూడా ప్రారంభించారు సీఎం.

టీఎస్ ఆర్టీసీలో మినీ బస్సులు నడపడం ఇదే మొదటిసారి. ప్రయాణికుల దగ్గరకే బస్సు అనే నినాదంతో వజ్ర బస్సులు ప్రారంభించింది.  మొదటి విడతలో హైదరాబాద్–వరంగల్ మధ్య 30, హైదరాబాద్ – నిజామాబాద్ రూట్ల 18 సర్వీసులు నడుపనున్నారు. వరంగల్ కు 300 రూపాయలు, నిజామాబాద్ కు 350 ఛార్జీలు నిర్ణయించింది ఆర్టీసీ. కొత్తగా ప్రవేశపెడుతున్న యాప్ తో…బస్సు బయల్దేరే అర్దగంట ముందు వరకు.. రిజర్వేషన్ చేసుకునే అవకాశం ఉంది.

One Response to కూల్ జర్నీ : రోడ్డెక్కిన వజ్ర బస్సులు

  1. Anonymous says:

    App name????

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy