కూల్ న్యూస్: రెంటుకు ఏసీలు, కూలర్లు

ac-collersసిటీలో ఎండ వేడిని తట్టుకోవడానికి రెంట్ కూలర్స్ అందుబాటులోకి వచ్చాయి. ఏసీలు, కూలర్లు కొనలేనివారి అద్దె కూలర్లను తీసుకునేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. రెండు, మూడు వేలు పెడితే చాలు కూలర్లను రెంట్ ఇస్తున్నారు వ్యాపారులు. సీజనల్ బిజినెస్ కావడంతో రెంట్ కాన్సెప్ట్ కి మంచి రెస్పాన్స్ వస్తుందంటున్నారు వ్యాపారులు.

మధ్యతరగతి కుటుంబాలు సమ్మర్ వేడిని తట్టుకోవడానికి ఇళ్లలో ఎక్కువగా కూలర్లనే కొంటుంటారు. కానీ ఈ ఏడాది కూలర్ల బిజినెస్ డల్ గా ఉంది. కంపెనీలు EMI సౌకర్యం కల్పించడంతో చాలామంది ఏసీలు కొనేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.  బ్యాంకులు, ఏటిఎంలలో కూడా డబ్బులు లేకపోవడంతో బిజినెస్ పై ప్రభావం పడిందంటున్నారు వ్యాపారులు.

ఇవే కాకుండా హై రేట్స్ తో కూలర్ కొన్నా..అవి ఎక్కువ కాలం పనిచేయడంలేదంటున్నారు జనం. దీంతో కొత్త కూలర్ కొనడం కంటే రెంట్స్ తీసుకోవడం బెస్ట్ ఆప్షన్ గా మారింది. చిన్న వ్యాపారులు, స్టూడెంట్స్, హైద్రాబాద్ లో కొన్ని రోజుల కోసం వచ్చే వారు అద్దెకు కూలర్లను తీసుకుంటున్నారని వ్యాపారులు చెబుతున్నారు.

ఇప్పటికే రెంట్ మీద కార్స్, జువెలరీ, హోం ఫర్నీచర్స్, కాస్ట్లీ వస్తువులను ఇస్తున్నారు. ఇప్పుడు సీజనల్ ప్రాడక్ట్స్ అయిన కూలర్లు కూడా అందుబాటులో వచ్చాయి.

One Response to కూల్ న్యూస్: రెంటుకు ఏసీలు, కూలర్లు

  1. Anonymous says:

    kcr kosam pettina chanal kcr ki bayapade chanala

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy