కూల్ న్యూస్ : హైదరాబాద్ లో చిరుజల్లులు

hyd

నిప్పుల కొలిమిలా ఉన్న హైదరాబాద్ నగరం ఒక్కసారిగా చల్లబడింది. ఉదయం నుంచే చెమటలు కక్కించిన భానుడు కాస్త శాంతించాడు. అత్యధిక ఉష్ణోగ్రతలతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న నగర జనం.. మధ్యాహ్నం వాతావరణం చల్లబటంతో ఊరట పొందారు జనం. అకస్మాత్తుగా ఉష్ణోగ్రతలు తగ్గడంతో కూల్ వెదర్ ను ఎంజాయ్ చేస్తున్నారు జనం. జంట నగరాల్లో చాలా చోట్ల వర్షం పడింది. దిల్ సుఖ్ నగర్, కొత్తపేట, చైతన్యపురి, కోఠి, బషీర్ బాగ్, మలక్ పేటలో వర్షం పడింది. సికింద్రాబాద్, కంటోన్ మెంట్ చుట్టుపక్కల ఏరియాల్లో ఉరుములు, మెరుపులతో భారీ వాన కురిసింది. రోడ్లు జలమయం అయ్యాయి. రామాంతపూర్, ఉప్పల్, మేడిపల్లి ప్రాంతాల్లోనూ వాన పడింది. ఖైరతాబాద్ లో చిరుజల్లులు పడ్డాయి. పంజాగుట్ట నుంచి మియాపూర్ వరకు అక్కడక్కడ జల్లులు పడ్డాయి. ఈ ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమై ఉంది. మొత్తంగా వీకెండ్ కు కూల్ వెదర్ వచ్చింది. శని, ఆదివారం కూడా సాయంత్రానికి వాతావరణం చల్లబడే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy