కూల్ వెద‌ర్‌: హైదరాబాద్‌ను క‌మ్మేసిన మ‌బ్బులు

weatherహైద‌రాబాద్‌లో వాతావ‌ర‌ణం ఒక్క‌సారిగా కూల్‌గా మారింది. ఉద‌యం ఆకాశాన్ని మ‌బ్బులు క‌ప్పేయ‌డం, మ‌ధ్యాహ్నానికి మ‌ళ్లీ ఎండ‌రావ‌డం జ‌రిగింది. ఆ త‌ర్వాత నాలుగు గంట‌ల స‌మ‌యంలో మ‌బ్బులు పూర్తిగా క‌మ్మేయ‌డంతో హైదరాబాదీలు డిఫరెంట్ వెదర్ ను ఎంజాయ్ చేశారు. వేడిగాలులు కూడా తగ్గాయి. చ‌ల్ల‌టి గాలి వీస్తుండ‌టంతో న‌గ‌ర‌వాసులు ఉప‌శ‌మ‌నం పొందారు. వీకెండ్ కావటం.. ఈవినింగ్ టైంలో అలా సరదాగా బయటకు వద్దామనుకున్న ఫ్యామిలీలకు ఊరట ఇచ్చింది వెదర్. టెంపరేచర్ కూడా సాయంత్రానికి తగ్గింది. జంట నగరాల్లో అక్కడక్కడ తేలికపాటి జల్లులు పడ్డాయి. ఇది వాతావరణాన్ని మరింత ఆహ్లాదకరంగా మార్చింది. ఆదివారం కూడా వాతావరణం ఇలాగే ఉంటే ఎంత బాగుండో అనుకుంటున్నారు. పిల్లలు సరదాగా బయటకు వచ్చిన వారు కూల్ వెదర్ తో ఎంజాయ్ చేశారు. మొన్నటి వరకు ఐదు, ఆరు డిగ్రీలు అధికంగా టెంపరేచర్స్ నమోదు అయ్యాయి. శనివారం ఉష్ణోగ్రత కూడ 41 డిగ్రీలుగా ఉంది. ఇది కూల్ వెదర్ కు కారణం.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy