కృష్ణమ్మ పరువళ్లు..గోదావరి ఉరకలు

ఎగువన కురిసిన వర్షాలతో పాటు..రాష్ట్రంలో పడుతున్న వానలతో…గోదావరి ఉగ్రరూపం దాల్చింది. కృష్ణమ్మ పరువళ్లు తొక్కుతుంది. ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాలో గోదావరి పొంగి పొర్లుతుంది. ప్రాజెక్టుల్లోకి ప్రమాద స్థాయిని మించి వరద వచ్చి చేరుతోంది. నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టుకి వరద కంటిన్యూ అవుతోంది. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి మట్టం 7 వందల అడుగులు కాగా…ప్రస్తుతం 695 అడుగులకు చేరుకుంది. ఇన్ ఫ్లో 24 వేల క్యూసెక్కులు కాగా… ఔట్ ప్లో 19 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు అధికారులు.  స్వర్ణ ప్రాజెక్టుకు కూడా వరద భారీగా వస్తుండటంతో.. ఒక గేటును ఎత్తి నీటిని కిందకు వదులుతున్నారు అధికారులు.

జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం దగ్గర గోదావరి నీటి మట్టం అంతకంత పెరుగుతోంది. దీంతో గోదావరి, ప్రాణహిత నదులు 9 మీటర్ల ఎత్తులో ప్రవహిస్తున్నాయి. మరోవైపు కొమురం భీం జిల్లా ఆడ ప్రాజెక్ట్ కు వరద కంటిన్యూ అవుతోంది…దీంతో మూడు గేట్లు ఎత్తి నీటిని కిందకు వదులుతున్నారు అధికారులు. నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టుకు వరద తగ్గింది. ఇన్ ప్లో 10 వేల క్యూసెక్కులు కాగా ఔట్ ప్లో 5 వేల కూసెక్కులు కొనసాగుతోంది. రెండు గేట్లు ఎత్తి నీటిని కిందికి వదులుతున్నారు. అయితే నిన్న వచ్చిన వరదతో లోతట్టు ప్రాంత గ్రామాల ప్రజలను అలర్ట్ చేశారు. మరోవైపు తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దుల్లో పెన్ గంగానది ఉదృతంగా ప్రహిస్తోంది.

భద్రాద్రి జిల్లా భద్రాచలం వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. ఎగువ నుంచి వరద పోటెత్తుతుండటంతో గోదావరి నీటిమట్టం గంటగంటకు పెరుగుతోంది. ప్రస్తుతం భద్రాచలం దగ్గర 47 అడుగులకు చేరింది. నీటిమట్టం 43 అడుగులకు చేరగానే అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. 48 అడుగులకు రాగానే రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నారు. ఎగువ నుంచి భారీగా వరద వచ్చే అవకాశం ఉండటంతో రాత్రి వరకు గోదావరి నీటిమట్టం 50 అడుగులకు చేరవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.

గోదావరి ఉధృతి పెరుగుతుండటంతో పరివాహక ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. దుమ్ముగూడెం, చెర్ల, వెంకటాపురం, ఏటూరునాగారం, పాతగూడెంలో అలెర్ట్ ప్రకటించారు. బూర్గంపాడు మండలంలోని మోతె, ఇరవెండి, సారపాక,రెడ్డి పాలెం, బూర్గంపాడు  ప్రాంతాల్లో ఉన్న లొతట్టు  ప్రజలను  సురక్షిత ప్రాంతాలకు తీసుకువెళ్లారు. రెవిన్యూ అధికారుల గ్రామాల్లో పర్యటిస్తూ ప్రజలకు జాగ్రత్తలు చెబుతున్నారు. గ్రామాల్లోకి నీరు వస్తే సమాచారం ఇవ్వాలని  అధికారులు సూచిస్తున్నారు.

కృష్ణమ్మ పరువళ్లు తొక్కుతోంది. తుంగభద్రతో పాటు.. జూరాలకు భారీగా ఇన్ ప్లో కొనసాగుతోంది. తుంగభద్రకు లక్షా 68 వేల ఇన్ ప్లో వస్తుండగా… లక్షా 94 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు అధికారులు. మరోవైపు జూరాల కు లక్షా 30 వేల ఇన్ ప్లో వస్తుండగా… ఔట్ ప్లో లక్షా 35 వేల క్యూ సెక్కుల నీటిని శ్రీశైలంకు రిలీజ్ చేస్తున్నారు. దీంతో…శ్రీశైలంకు 3 లక్షల 23 వేల క్యూసెక్కుల ఇన్ ప్లో కొనసాగుతోంది.

శ్రీశైలం పూర్తి స్థాయి నీటి మట్టం 215 టీఎంసీలు కాగా…..ప్రస్తుతం 179 టీఎంసీలకు చేరుకుంది. అటు సాగర్ కు లక్ష క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు.. అయితే వరద కొనసాగుతుండటంతో…శనివారం (ఆగస్టు-18)సాయంత్రం శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు ఎత్తే అవకాశం ఉందంటున్నారు అధికారులు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy