కృష్ణవంశీ హర్రర్ రుద్రాక్ష

0014రుద్రాక్ష.. టైటిల్ వింటే ఆధ్యాత్మికం వినిపిస్తున్నారు.. తెరపై మాత్రం బీభత్సం చేస్తానంటోంది. ఫ్యామిలీ సెంటిమెంట్.. విలేజ్ బ్యాక్ డ్రాప్ తో లవ్లీ మూవీస్ తీసే కృష్ణవంశీ… ఈ సారి భయపెడతానంటున్నాడు. హర్రర్ కథతో.. రుద్రాక్ష టైటిల్ తో సరికొత్త మూవీని తెరకెక్కిస్తున్నాడు. ఓ ప్రముఖ హీరోయిన్ ఈ మూవీలో టైటిల్ రోల్ పోషిస్తున్నట్లు సమాచారం. అనుష్క అని టాక్ వస్తున్నా.. ప్రస్తుతానికి ఈ బ్యూటీ డైరీ మొత్తం ఫుల్ అంట. డేట్స్ అడ్జస్ట్ మెంట్ చేస్తే మాత్రం అనుష్కకే ఫస్ట్ ప్రయార్టీ ఇవ్వాలని కూడా ఆలోచిన్నారు వంశీ. అయితే వంశీ బ్రాండ్ తో ఓ రేంజ్ కు వెళ్లిన కాజల్ కూడా రేసులో ఉన్నట్లు ఫిల్మ్ ఇండస్ట్రీ టాక్. అనుష్క, నయనతార, త్రిష ఇలా అందరూ భయపెట్టారు.. ఆ గ్రూప్ లో ఒక్క కాజల్ మాత్రం ఇంకా అందాలు చూపిస్తూ ఉంది. ఈ క్రమంలోనే హిట్ కాంబినేషన్.. కొత్త క్యారెక్టర్.. కావాల్సినన్ని డేట్స్ ఇవ్వటానికి రెడీగా ఉంది.. దీంతో కాజల్ అయితే వర్క్ పరంగా ఈజీ అవుతుందని అని అంచనాకు వచ్చారంట. నెలాఖరున ఫ్రీ పొడక్షన్ స్టార్ట్ కాబోతుంది. దీనికి ప్రకాష్ రాజ్ ఓ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ఈక్వేషన్స్ చూస్తే.. దెయ్యంగా భయపెట్టనున్న హీరోయిన్ కాజల్ అంటూ ఫిల్మ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యింది.

Comments are closed.

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy