కృష్ణాష్టమి రోజు ఉట్టి ఎందుకు కొడతారంటే..!

కృష్ణుడి జన్మదినమే కృష్ణాష్టమి… ఇందుకు మరోపేరు గోకులాష్టమి. ఈ పండుగ రోజున వీధుల్లో ఉట్లు కట్టి పోటీపడి వాటిని కొడతుంటారు. అందుకే ఈ పండుగని ‘ఉట్ల పండుగ’ అంటారు. చిన్న తనంలో కృష్ణుడు చిలిపి పనులు చేస్తుండేవాడు. స్నేహితులతో కలసి అల్లరి పనులు చేసేవాడు. వెన్న దొంగిలించి తింటుండేవాడు. వెన్నదొంగ కృష్ణుడి బాధ పడలేక విసుగు చెందిన గోపికలు.. అతనికి అందకుండా ఇళ్లలో ఎత్తులో వెన్నకుండలను ఉట్టిపై పెట్టేవారు. ఐనా బాలకృష్ణుడు ఉట్టి కుండలను అందుకుని వెన్న దొంగిలించి తినేవాడు. ఒక్కో స్నేహితుడు ఒకరిపై ఒకరు ఎక్కి నిలబడి.. చివర్లో కృష్ణుడు ఉట్టికుండలోని వెన్న దొంగతనం చేసేవాడు. అలా ఆ వెన్నదొంగను గుర్తు చేసుకోవడానికే కృష్ణాష్టమి రోజు ఉట్టి కొడతారు.

ఉట్టికుండల్లో వెన్నను దొంగతనం చేసిన బాలకృష్ణుడికే గోవిందుడు అనే పేరొచ్చింది. చిన్ని కృష్ణుడి చేష్టలకు గుర్తుగా… ఉట్టికొట్టే ఉత్సవాన్ని వేడుకగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. మహా నగరాల్లో ఉట్లోత్సవం గ్రాండ్ గా జరుపుతారు. చాలా ఎత్తులో ఉట్లు కట్టి కొడుతుంటారు. గ్రామాల్లో ఊరేగింపులు చేసి ఆలయాల దగ్గర కుల పెద్ద చేత ఉట్టికొట్టించి.. సామూహిక భోజనాలు నిర్వహిస్తుంటారు. ఈ వేడుకల్లో కుల, మతాలకు సంబంధం లేకుండా పాల్గొంటుంటారు.  ఉట్టి కొట్టడం వల్ల యువకుల్లో సోషలైజేషన్‌ పెరుగుతుంది. ఒక్కడి కోసం పది మంది, పది మంది కోసం ఒక్కడు నిలిచే మంచిగుణం యువతకు అలవాటు పడుతుంది.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy