కృష్ణా జలాల పంపిణీలో రాష్ట్రానికి అన్యాయం

sc_1665756fముందుగా తెలంగాణ పిటిషన్ ను విచారించనున్న సుప్రీం

కృష్ణా జలాల పంపిణీలో రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని పరిశీలించుందుకు సుప్రీం కోర్టు ఓకే చెప్పింది. ముందుగా తెలంగాణ పిటిషన్ విచారించేందుకు అంగీకరించింది. ఆ తర్వాతే పెండింగ్ లో ఉన్న ఏపీ, మహారాష్ట్ర, కర్ణాటక స్పెషల్ లీవ్ పిటిషన్లను విచారిస్తామని స్పష్టం చేసింది. కృష్ణా జలాల పంపిణీ నాలు రాష్ట్రాల మధ్య జరగాలా ? ఏపీ, తెలంగాణ మధ్య జరగాలా అనే విషయాన్ని తామే విచారిస్తామని క్లారిటీ ఇచ్చింది సుప్రీం. జల వివాదాన్ని ఎక్కువకాలం పొడిగించడం మంచిదికాదని తెలిపింది. ఈనెల 15న తుది వాదనలు విననుంది కోర్టు. కృష్ణా జలాల పంపిణీలో అన్యాయం జరిగిందంటూ రాష్ట్ర ప్రభుత్వం ఫైల్ చేసిన పిటిషన్ ను జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ పీసీ సంపత్ ధర్మాసనం విచారించింది.  తెలంగాణను కొత్తగా ఏర్పడిన రాష్ట్రంగా చూడాలి  తప్ప… ఏపీ నుంచి పుట్టిన స్టేట్ గా చూడొద్దన్నారు అడిషనల్ అడ్వకేట్ జనరల్ రామచంద్రరావు.  మూడు రాష్ట్రాలతో పాటు  సమానంగా నీటి వాటను కోరే హక్కు తెలంగాణకు ఉందని వాదనలు వినిపించారు. బ్రిజేశ్ కుమార్ ట్రబ్యునల్ విచారణ లో రాష్ట్రానికి సంబంధించిన విషయాలు  వినిపించే అవకాశం రాలేదన్న రాష్ట్ర వాదనకు సుప్రీ నుంచి సానుకూలంగా స్పందన వచ్చింది. కృష్ణా బేసిన్ మొత్తాన్ని ఒక యూనిట్ గా తీసుకోవాలని సుప్రీం కు సూచించారు అడిషనల్ అడ్వకేట్ జనరల్. కావేరి జలాల వివాదం విచారణలో నదీ బేసిన్ ను ఒక యూనిట్ గా తీసుకున్న విషయాన్ని  గుర్తు చేశారు. అదే ఫార్ములా ఇక్కడ పాటించాలన్నారు. మరోవైపు బ్రిజేశ్  ట్రిబ్యునల్ లో చాలాకాలంగా   జడ్జి పోస్టు ఖాళీగా  ఉండటంతో.. ఇప్పటివరకు వాదనలు సరిగా జరగలేదు. కొత్తగా కర్ణాటకకు చెందిన జస్టిస్ రామ్మెహన్ రెడ్డిని జడ్జిగా నియమించడంతో కృష్ణా జలాల పంపకానికి సంబంధించిన వాదనలు స్పీడప్ కానున్నాయి.

NSP

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy