కెన్యాలో ఉగ్ర దాడి : 11 మంది మృతి

 కెన్యా రాజధాని నైరోబిలోని ఓ హోటల్ పై ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ ఘటనలో 11 మంది చనిపోయారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. నైరోబిలో వెస్ట్ ల్యాండ్ డిస్ట్రిక్ట్ లోని ఓ హోటల్ లో ప్రవేశించిన దుండగులు పార్కింగ్ ప్లేస్ లోని వెహికిల్స్ పై బాంబులు విసిరారు. తర్వాత కాల్పులు జరిపారు. ఒక ఉగ్రవాది ఆత్మాహుతి చేసుకున్నాడు.  ఘటనా స్థలంలోనే ఐదుగురు మృతి చెందారు. మరొకతను హాస్పిటల్ లో చనిపోయాడు. విదేశీయులే లక్షంగా ఈ దాడి జరిగినట్లు అక్కడి పోలీసులు తెలిపారు.

ఇప్పటివరకు తెలిసిన వివరాల ప్రకారం మొత్తం 11 మంది చనిపోయారు. దాడి సమాచారం అందుకున్న భద్రతా బలగాలు హోటల్ కు చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చాయి. ఈ దాడికి తామే కారణమని అల్ షబాబ్ ఉగ్రవాద సంస్థ ప్రకటించుకుంది.

 

 

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy