కెమిస్ట్రీలో ముగ్గురు సైంటిస్టులకు నోబెల్ అవార్డ్స్

41444215261_625x3002015 సంవత్సరానికి గాను కెమిస్ట్రీలో నోబెల్ అవార్డు ముగ్గురు శాస్త్రవేత్తలను దక్కింది. రసాయనశాస్త్ర రంగంలో విశేష సేవలందించినందుకు గాను థామస్‌ లిండాల్‌(ఇంగ్లాండ్‌), పాల్‌ మోడ్రిచ్‌(అమెరికా), అజీజ్‌ సాంకర్‌ (అమెరికా)లకు నోబెల్‌ పురస్కారం ప్రకటించారు. డీఎన్ఏపై మరింత రిసెర్చ్ లు చేసి…జన్యు రహస్యాలను మరింతగా తెలిపినందుకు గాను వీరికి ఈ అవార్డు లభించింది. ఆల్ ఫ్రెడ్ నోబెల్ కెరీర్లో కెమిస్ట్రీలో మెయిన్ రోల్  పోషించింది. ఇప్పటి వరకు కేవలం నలుగురు మహిళలకు మాత్రమే రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతి లభించింది. 1901 నుంచి 2014 వరకూ మొత్తం 169 మంది రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతులు అందుకున్నారు. రసాయన… భౌతిక శాస్త్రంలోనూ నోబెల్ బహుమతి పొంది ఏకైక మహిళ మేడమ్ క్యూరీ మాత్రమే. రసాయన శాస్త్రంలో నోబెల్ పురస్కారం అందుకున్న చిట్ట చివరగా 2009లో అదా యోనథ్ అనే మహిళకు దక్కింది. బ్రిటన్‌కు చెందిన ఫ్రెడ్రిక్ సంగర్ అనే వ్యక్తి రెండు సార్లు రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతిని అందుకున్నారు.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy