కెమెరాలను చూసి ఎన్టీఆర్ షాక్

ntr-bigboss2వెండితెర‌పై సంచ‌ల‌నాలు సృష్టించిన‌ జూనియ‌ర్ ఎన్టీఆర్ ప్ర‌స్తుతం బుల్లితెర ఎంట్రీకి సిద్ధ‌మ‌వుతున్నాడు. స‌ల్మాన్ హిందీలో చేస్తున్న బిగ్ బాస్ షో మాదిరిగా తెలుగులో ఎన్టీఆర్ తో ఓ కార్య‌క్ర‌మాన్ని రూపొందిస్తున్నారు నిర్వాహ‌కులు. ముంబైలో ఈ ప్రోగ్రాం షూటింగ్ జ‌రుగుతుంద‌ని తెలుస్తోంది. అయితే తాజాగా ఇక్కడ ఓ టీజర్ విడుద‌ల చేశారు. ఇందులో ఎన్టీఆర్ ఉద‌యాన్నే నిద్ర‌లేచి టీ తాగుతుండ‌గా, ఎదురుగా ఉన్న కెమెరాల‌ని చూసి షాక్ అవుతాడు. కెమెరాల‌ని బిగ్ బాస్ హౌస్ లో పెట్ట‌మంటే నా ఇంట్లో పెట్టారేంటి అనే డైలాగ్ చెబుతాడు. ఈ ప్రోమో  సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతుంది. ప‌లువురు టాప్ స్టార్స్ తో సాగే ఎంట‌ర్ మైన్ మెంట్ ప్రోగ్రాంగా తెలుగు బిగ్ బాస్ షో రూపొందిస్తున్నారు నిర్వాహకులు. ఎన్టీఆర్ ఒకవైపు జై ల‌వ‌కుశ చిత్రాన్ని చేస్తూనే మ‌రో వైపు ఈ బిగ్ బాస్ షో షూటింగ్ లో కూడా పాల్గొంటున్న‌ట్టు తెలుస్తోంది. మ‌రి ఇటు స్మాల్ స్క్రీన్, అటు బిగ్ స్క్రీన్ పై ఎన్టీఆర్ చేసే సంద‌డి ఫ్యాన్స్ లో మాత్రం మంచి జోష్ తెప్పిస్తోంది.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy