కేంద్రంతో సఖ్యంగానే ఉంటాం: కేటీఆర్

KTR2రాష్ట్రానికి సంబంధించి పెండింగ్ లో ఉన్న విషయాలపై చర్చించేందుకు ఢిల్లీలో కేంద్ర మంత్రులతో సమావేశమయ్యారు మంత్రి కేటీఆర్. పట్టణాల అభివృద్ధి గురించి .. కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడితో చర్చించారు కేటీఆర్. కేంద్రం నుంచి రావాల్సిన పెండింగ్ నిధులు.., రాష్ట్ర, దేశ రాజకీయాల మీద మాట్లాడుకున్నారు. ముఖ్యంగా.. స్మార్ట్ సిటీల పథకంలో  కేటాయింపులు, నిధుల విడుదలపై చర్చించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విభజన సమస్యలపై కూడా మాట్లాడారు. రాష్ట్రం అడిగినట్టు అసెంబ్లీ సీట్ల సంఖ్యను పెంచుటానికి కేంద్రానికి ఇబ్బందేమీ లేదన్న వెంకయ్య.. కొన్ని న్యాయపరమైన అడ్డంకుల వల్లనే లేటవుతున్నదని చెప్పారు.  కేంద్రంతో కలిసే ఉంటామని.. కేంద్ర, రాష్ట్రాల మధ్య గొడవలుంటే ఇబ్బందికరంగా ఉంటుందని అన్నారు కేటీఆర్. ఇబ్బందులను చర్చలతో పరిష్కరించుకుంటామని చెప్పారు కేటీఆర్.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy