కేంద్రం కొత్త స్కీమ్ : ఎలక్ట్రిక్ కార్లు కొంటే భారీ రాయితీలు

v6-fb-(3)కాలుష్యం నుంచి విముక్తి కోసం సంచలన నిర్ణయాలు తీసుకుంటోంది కేంద్ర ప్రభుత్వం. కొత్త వాహన విధానానికి శ్రీకారం చుట్టబోతున్నది. రాబోయే ఐదేళ్లలో భారీ మార్పులకు ఇప్పటి నుంచే అడుగులు వేస్తోంది. హైబ్రీడ్, ఎలక్ట్రిక్ వెహికల్స్ అందుబాటులోకి తెచ్చే విధంగా నివేదిక సిద్ధం చేసింది. అందులోని ముఖ్య విషయాలు ఇలా ఉన్నాయి. ఎలక్ట్రిక్ వాహనాల తయారీ, కొనుగోళ్ల కోసం రూ.9వేల 400 కోట్ల ప్యాకేజీ తీసుకొస్తుంది. ఇందులో భాగంగా రూ.15లక్షల విలువైన ఎలక్ట్రిక్ కారు కొనుగోలు చేసే వారికి రూ.2.50లక్షల రాయితీ ప్రకటించనుంది కేంద్రం. అదే విధంగా తయారీ కంపెనీలకు, షోరూం యజమానులకు కూడా ఆఫర్స్ ఇవ్వనుంది. ప్రస్తుతం ఉన్న పెట్రోల్, డీజిల్ కారును ఎక్స్చేంజ్ చేసుకునే ఎలక్ట్రిక్ లేదా హైబ్రీడ్ కారు కొనుగోలు చేసే వారికి కూడా రూ.1.50లక్షల వరకు రాయితీ ప్రకటించనున్నారు. ఇక బైక్స్ (టూవీలర్) కొనుగోలు చేసేవారి కూడా రూ.30వేల వరకు రాయితీ ప్రకటించాలనే ప్రతిపాదన రెడీ అయ్యింది. ముందుగా కార్పొరేట్ కంపెనీలను ఎలక్ట్రిక్, హైబ్రీడ్ వాహనాల వైపు మళ్లించటానికి ఈ రాయితీలు ఉపయోగపడతాయని అంచనా వేస్తున్నారు. వీటితోపాటు క్యాబ్స్, బస్సులు కొనుగోలు చేసేవారి కూడా వివిధ రకాలుగా ప్రయోజనం చేకూర్చే విధంగా రాయితీలు ఇవ్వటానికి డ్రాఫ్ట్ సిద్ధం చేసింది కేంద్రం.

ఎలక్ట్రిక్ వాహనాలు సరే.. మరి చార్జింగ్ ఏంటీ.. ఈ విషయంలోనూ కేంద్రం భారీ సన్నాహాలు చేస్తోంది. దేశ వ్యాప్తంగా వెయ్యి చార్జింగ్ పాయింట్లను యుద్ధ ప్రాతిపదికన ఏర్పాటుకు నిర్ణయించింది. ఇందులో భాగంగా మెట్రో నగరాల్లో ప్రతి తొమ్మిది కిలోమీటర్ కు ఓ చార్జింగ్ పాయింట్ ఉండే విధంగా యాక్షన్ ప్లాన్ రెడీ చేసింది. అదే విధంగా ఢిల్లీ – జైపూర్, ఢిల్లీ – చండీఘర్, చెన్నై–బెంగళూరు, ముంబై-పూణె జాతీయ రహదారులపై ప్రతి 25కిలోమీటర్లకు ఓ చార్జింగ్ పాయింట్ ఉండే విధంగా చర్యలు తీసుకోబోతున్నది. రాబోయే ఐదేళ్లలో ఎలక్ట్రిక్ కార్లు, బైక్స్ ధరలు తగ్గించటం కోసం ఏకంగా రూ.5వేల 800 కోట్లు ఖర్చు చేయనున్నట్లు కేంద్రం నివేదిక చెబుతోంది. మొత్తంగా రూ.9వేల 400 కోట్ల ప్యాకేజీని చూస్తే దేశవ్యాప్తంగా కేవలం 5లక్షల వాహనాలకు మాత్రమే ఈ ప్రయోజనాలు అందుతాయి. అంటే దేశంలోని వాహనాల్లో ఇది కేవలం పాయింట్ 5 (0.5)శాతం మాత్రమే.

డ్రాఫ్ట్ సిద్ధం చేసిన ప్రభుత్వం.. ఇంకా ఆమోద ముద్ర వేయలేదు. కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే మాత్రం ఆటోమొబైల్ రంగంపై తీవ్ర ప్రభావం పడనుంది. కార్లు, బైక్స్ తయారీ కంపెనీలు అన్నీ కూడా హైబ్రీడ్, ఎలక్ట్రిక్ కార్ల తయారీవైపు విస్తరణ చేసుకోవాలి. దీనికితోడు ప్రస్తుతం కొత్తగా కార్లు కొనుగోలు చేయాలి అనుకునే వారు వేచిచూసే అవకాశం ఉంటుంది. అప్పుడు ఆటోమొబైల్ ఇండస్ట్రీనే సంక్షోభంలో పడే ప్రమాదం ఉందని ఆర్థిక, మార్కెట్ నిపుణులు అంటున్నారు. ప్రస్తుతానికి డ్రాఫ్ట్ సిద్ధం అయినా.. ఆమోదం సమయానికి ఇంకెన్ని మార్పులు ఉంటాయో చూడాలి..

Leave a Reply

Your email address will not be published.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy