
చెరకు నుంచి 100శాతం ఇథనాల్ ను ఉత్పత్తి చేసే ఫ్యాక్టరీలకు ఇన్సెంటివ్ ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. దీని ప్రకారం లీటరు ఇథనాల్ కు 59 రూపాయల 19పైసలు చెల్లించనుంది ప్రభుత్వం. అలాగే B-హెవీ ఇథనాల్ ధర కూడా 52 రూపాయల 43పైసలకు పెంచింది.
దేశంలో కొత్తగా ఏర్పాటు చేసిన నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిజైన్స్ కు ఇనిస్టిట్యూషన్స్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్ హోదా ఇచ్చేందుకు కేంద్రమంత్రివర్గం ఆమోదించింది. NID విజయవాడ పేరును NIDఅమరావతిగా మార్చేందుకు కేబినెట్ అంగీకారం తెలిపింది. దేశంలో 13వేల 675 కిలోమీటర్ల రైల్వే లైన్లను ఎలక్ట్రిఫికేషన్ చేసేందుకు 12వేల 134 కోట్లు కేటాయిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది.
రాష్ట్రీయ్ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ భూమిని ముంబై మెట్రోపాలిటన్ రీజినల్ డెవలప్మెంట్ అథారిటీ ఇవ్వవాలని కేబినెట్ నిర్ణయించింది. అంతరిక్ష రంగంలో భారత్-సౌతాఫ్రికాల మధ్య MoUకు కేబినెట్ ఒకే చెప్పింది.