కేంద్ర పర్యావరణశాఖ మంత్రిగా హర్షవర్ధన్

harshvardhanకేంద్ర పర్యావరణశాఖ మంత్రిగా అదనపు బాధ్యతలు చేపట్టారు హర్షవర్ధన్. ఆ శాఖ మంత్రిగా ఉన్న అనిల్‌ మాధవ్‌ దవే ఇటీవల మరణించడంతో ఖాళీ ఏర్పడింది. దీంతో శాస్త్ర, సాంకేతికశాఖ మంత్రిగా ఉన్న హర్షవర్ధన్‌కు పర్యావరణ శాఖ అదనపు బాధ్యతలు అప్పగించారు. ఈ సందర్భంగా నేడు బాధ్యతలు స్వీకరించిన హర్షవర్థన్‌.. మాజీ మంత్రి, దివంగత అనిల్‌ దవే స్మారకార్థం ఆఫీస్‌ ప్రాంగణంలో మొక్క నాటారు. కేంద్ర పర్యావరణ, అటవీశాఖ మంత్రిగా పనిచేసిన అనిల్‌ దవే.. మే 18న గుండెపోటుతో కన్నుమూశారు. అయితే ఆయన మరణానంతరం ఎటువంటి విగ్రహాలు ఏర్పాటుచేయరాదని, అవార్డులు ఇవ్వొద్దని దవే తన వీలునామాలో రాశారు. తన గుర్తుగా మొక్కను నాటితే ఎంతో సంతోషిస్తానన్నారు. అందుకే ఒ మొక్క నాటారు హర్షవర్ధన్.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy