కేంద్ర మంత్రులకు శాఖలను కేటాయించిన పీఎంవో..

Untitledనరేంద్ర మోడీ దేశ ప్రధానిగా ఈ రోజు తన బాధ్యతలను స్వీకరించారు. నిన్న ప్రమాణ స్వీకారం చేసిన ఆయన ఈ రోజు ఉదయాన్నే పీఎంవోకి చేరుకొని తన పనిని ప్రారంభించారు. ఇక తన క్యాబినేట్ లో మంత్రులకు కూడా శాఖలను కేటాయించారు మోడీ. ఇప్పటికే సార్క్ దేశాల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహిస్తూ తొలి రోజు బిజీగా ఉన్నారు. ఇక సాయంత్రం 6 గంటలకు మోడీ తన టీంతో తొలి క్యాబినేట్ మీటింగ్ నిర్వహించనున్నారు. ఇప్పటికే ఆర్ధిక మంత్రిగా అరుణ్ జైట్లీ తన బాధ్యతలను స్వీకరించారు. రైల్వే మంత్రి సదానందగౌడ కూడా బాధ్యతలను తీసుకున్నారు. సాయంత్రం లోపు మిగతా మంత్రులంతా తమ బాధ్యతలను స్వీకరిస్తారని పీఎంవో తెలిపింది.

మోడీ క్యాబినేట్ మంత్రులు వారి శాఖలు

  • రాజ్ నాథ్ సింగ్—హోంశాఖ
  • సుష్మాస్వరాజ్—విదేశాంగ శాఖ
  • అరుణ్ జైట్లీ—ఆర్ధిక, రక్షణ,కార్పోరేట్
  • వెంకయ్య నాయుడు—పట్టణాభివృద్ధి, పేదరిక నిర్మూలన, పార్లమెంటరీ వ్యవహరాలు
  • నితిన్ గడ్కారీ—రవాణా, షిప్పింగ్
  • సదానంద గౌడ—రైల్వే శాఖ
  • ఉమాభారతి—జలవనరులు, గంగా నది ప్రక్షాళన
  • నజ్మా హెప్తుల్లా—మైనార్టీ శాఖ
  • గోపీనాథ్ ముండే – గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్, త్రాగునీరు
  • రాంవిలాస్ పాశ్వాన్—ఆహార, పౌరసరఫరాల శాఖ
  • కల్ రాజ్ మిశ్రా—చిన్న, మధ్యతరహా పరిశ్రమలు
  • మేనకా గాంధీ—స్త్రీ శిశు సంక్షేమశాఖ
  • అనంత్ కుమార్—ఎరువులు, రసాయనాలు
  • రవిశంకర్ ప్రసాద్—సమాచార, న్యాయశాఖ
  • అశోక్ గజపతి రాజు—పౌరవిమానయాన శాఖ
  • అనంత్ గీతే—భారీ పరిశ్రమలు
  • హర్ సిమ్రాత్ కౌర్ బాదల్—ఆహార శాఖ
  • నరేంద్ర సింగ్ తోమర్—స్టీల్, మైనింగ్
  • జుమల్ ఓరమ్—గిరిజనాభివృద్ధి
  • రాధా మోహన్ సింగ్—వ్యవసాయం
  • తహర్ చంద్ హెగ్లాట్—సామాజిక న్యాయం
  • స్మృతీ ఇరానీ—మానవ వనరులు అభివృద్ధి
  • హర్షవర్ధన్—ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ

 

 స్వతంత్ర్య హోదా మంత్రులు వారి శాఖలు….

  • వీకే సింగ్—విదేశాంగ సహాయ మంత్రి
  • ఇంద్ర జిత్ సింగ్—ప్రణాళిక,  రక్షణ గణాంకాలు
  • సంతోష్ కుమార్ గంగ్ వార్—టెక్స్ టైల్, పార్లమెంటరీ వ్యవహారాలు, నదీ జలాలు
  • శ్రీపద్ యస్ నాయక్—పర్యాటక, సాంస్కృతిక శాఖ
  • ధర్మేంద్ర ప్రధాన్—పెట్రోలియం, సహజవాయువులు
  • సర్భానంద సోనోవాల్— యూత్ ఎఫైర్స్, క్రీడలు
  • ప్రకాశ్ జవదేకర్—అటవీ వ్యవహరాలు, పర్యావరణం
  • పియూష్ గోయల్—విద్యుత్, బొగ్గు
  • జితేంద్ర సింగ్—సైన్స్ అండ్ టెక్నాలజీ
  • నిర్మలా సీతారామణ— వాణిజ్య, పరిశ్రమలు

సహాయ మంత్రులు వారి శాఖలు

  • జీఎం సిద్ధేశ్వర— పౌరవిమానయాన శాఖ
  • మనోజ్ సిన్హా—రైల్వే శాఖ
  • నిహాల్ చంద్—రసాయనాలు, ఎరువులు
  • ఉపేంద్ర కుష్వాహా—గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్
  • రాధాకృష్ణన్—భారీ పరిశ్రమలు
  • కిరణ్ రిజ్జి—హోంశాఖ
  • క్రిష్ణపాల్ —రవాణా, షిప్పింగ్
  • సంజీవ్ కుమార్ బాల్యన్—వ్యవసాయం, ఆహార ఉత్పత్తి
  • మున్సుక్ భాయి ధన్జీభాయి వాసవా—గిరిజనాభివృద్ధి
  • రావ్ సాహెబ్ దాదారావ్ దాన్వే—వినియోగదారుల, పౌరసరఫరాల శాఖ
  • విష్టుదేవ్ సాయి—గనులు, స్టీల్, కార్మిక శాఖ
  • సుదర్శన్ భగత్—సామాజిక న్యాయం

 

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy