
సౌత్ ముంబై నుంచి నాలుగుసార్లు ఎంపీగా గెలిచిన మురళీదేవ్ రా…1980లో మొదటిసారిగా లోక్ సభలో అడుగుపెట్టారు. ముంబై లో ఇండ్రస్ట్రియలిస్ట్, సోషల్ వర్కర్ గా మంచి పేరు సంపాందించుకున్నారు. 1968లో ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కార్పొరేటర్ గా గెలిచిన దేవ్ రా, 1977లో శివసేన సపోర్ట్ తో ముంబై మేయర్ గా పని చేశారు. 2004లో రాజ్యసభ సభ్యునిగా ఎన్నికై పెట్రోలియం శాఖ మంత్రిగా పని చేశారు. మురళీదేవ్ రా కొడుకు మిలింద్ దేవ్ రా ప్రసుత్తం ముంబై ఎంపీగా ఉన్నారు.