కేంద్ర మాజీ మంత్రి సన్వర్ లాల్ జాట్ మృతి

sanwar_lal_jatబీజేపీ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి సన్వర్ లాల్ జాట్ చనిపోయారు. జూలై 22నాడు జైపూర్ లో బీజేపీ చీఫ్ అమిత్ షా సభకు హాజరైన సన్వర్ లాల్ అక్కడే కుప్పకూలారు. వెంటనే ఆయన్ని జైపూర్ లోని సవాయ్ మాన్ సింగ్ హాస్పిటల్ కు తరలించారు. కార్డియాలజిస్ట్, న్యూరాలజిస్ట్ లు ఆయనకు ట్రీట్మెంట్ అందించారు. ఆయన కోలుకోకపోవడంతో… 27నాడు ఢిల్లీలోని ఎయిమ్స్ కు షిఫ్ట్ చేశారు. ఆయన రెండు కిడ్నీలు చెడిపోయాయి. డయాలసిస్ కొనసాగించారు డాక్టర్లు. అలాగే ఆయనకు డయాబెటిస్, గుండె సంబంధిత వ్యాధులున్నాయి. 22 నుంచి ఆయన కోమాలోనే ఉన్నారు. ఈ ఉదయం చికిత్స పొందుతూ కోమాలోనే మరణించారు సన్వర్ లాల్.

రాజస్థాన్ లోని అజ్మీర్ లోక్ సభ నియోజకవర్గం నుంచి ఎంపీగా ఉన్నారు జాట్. ఢిల్లీ ఎయిమ్స్ లో చికిత్స పొందుతున్న సన్వర్ లాల్… ఉదయం మరణించారు. 2014 నవంబర్ 9 నుంచి 2016 జూలై 5 వరకు కేంద్ర జలవనరుల శాఖ సహాయమంత్రిగా పనిచేశారు. 2014 లోక్ సభ ఎన్నికల్లో రాజస్థాన్ కాంగ్రెస్ అధ్యక్షుడు సచిన్ పైలట్ ను ఓడించి సంచలనం సృష్టించారు జాట్. ఆయన మృతికి ప్రధాని మోడీ, కేంద్రమంత్రులు, సచిన్ పైలట్ ట్విట్టర్ లో సంతాపం తెలిపారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy