కేంద్ర సర్కార్ చర్యలతో స్విస్ బ్యాంకులు బేజార్….

విదేశాల నుంచి బ్లాక్ మనీ తెప్పించడంపై కేంద్ర సర్కార్ ఫుల్లుగా ఫోకస్ చేసింది. నయా పైసాతో సహా నల్లధనాన్ని వెనక్కితెప్పిస్తామని ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు. ఇప్పటికే బ్లాక్ మనీ అకౌంట్లపై విచారణ చేపట్టేందుకు సిట్  కూడా ఏర్పాటైంది. కేంద్ర సర్కార్ చర్యలతో స్విస్ బ్యాంకులు బేజారవుతున్నాయి. విచారణను ఎలా ఎదుర్కోవాలనేదానిపై డిఫెన్స్ పడ్డాయి. సెల్ప్ ప్రోటెక్షన్ కోసం స్విస్ బ్యాంకులు తెగ ట్రై చేస్తున్నాయి. బ్యాంకుల ప్రయోజనాలు కాపాడాలని స్విస్ ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నాయి. సమాచార మార్పిడి విషయంలో ఫస్ట్ ప్రియారిటీ తమకే ఇవ్వాలని బ్యాంకు యజమాన్యాలు గట్టిగా చెబుతున్నాయి. బ్లాక్ మనీని విదేశీ పెట్టుబడులుగా మార్చేందుకు… భారతీయ కార్పొరేట్ సంస్థలతో కొన్ని యూరోపియన్ బ్యాంకులు కుమ్మక్కు అయ్యాయన్న అనుమానాలు కూడా ఉన్నాయి. ఇందులో రెండు స్విస్ బ్యాంకుల పేర్లు కూడా వినపడుతున్నాయి.

నల్ల ధనం నిల్వలున్న బ్యాంకులు… వివిధ మార్గాల ద్వారా తమ డబ్బును తరలించుకోవాలని ఖాతాదారులకు సూచిస్తున్నాయి. అంతేకాదు తమ అకౌంట్లపై పూర్తి  బాధ్యత ఖాతాదారులపైనే పెడుతున్నాయి. కొన్ని బ్యాంకులైతే మన దేశ ఖాతాదారుల నుంచి రాత పూర్వక ఒప్పందాలను తీసుకుంటున్నాయి. ఏదైనా జరిగితే బ్యాంకుల ప్రమేయం లేదని చెప్పేందుకు ప్రయత్నిస్తున్నాయి. అలా సంతకం చేయని ఖాతాదారుల అకౌంట్లు రద్దుచేసేందుకు కూడా వెనకాడటం లేవు.

స్విస్ బ్యాంకులు మరికొన్ని ఎత్తుగడలు కూడా వేస్తున్నాయి.  అసలు ఖాతాదారులెవరనేది తెలియకుండా బ్యాంకులు జాగ్రత్త పడుతున్నాయి.  అక్రమ నిధులను ఆర్థిక వ్యవస్థల్లోకి మళ్లించి విచారణకు చిక్కులు కల్పించే ప్రయత్నాలు కూడా చేస్తున్నాయి.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy