కేంద్ర హోంశాఖ వెబ్‌సైట్‌ హ్యాక్

uohకేంద్ర హోం శాఖకు చెందిన వెబ్‌సైట్‌ ఆదివారం హ్యాకయింది. గుర్తు తెలియని హ్యాకర్లు ఈ సైట్‌ను హ్యాక్‌ చేశారు. పాక్‌కు చెందిన హ్యాకర్లే ఈ చర్యకు పాల్పడి ఉంటారని హోంశాఖ అధికారులు భావిస్తున్నారు. ఈ హ్యాకింగ్‌ సమాచారం తెలిసిన వెంటనే నేషనల్‌ ఇన్ఫర్మేటిక్స్‌ సెంటర్‌.. హోం శాఖ వెబ్‌సైట్‌ను తాత్కాలికంగా బ్లాక్‌ చేసింది. కంప్యూటర్‌ ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ టీం కూడా రంగంలోకి దిగి హ్యాకర్లు ఎవరు.. ఎలా హ్యాక్‌ చేశారన్న అంశాలపై దర్యాప్తు చేపట్టింది.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy