కేఎస్ రవికుమార్ డైరెక్షన్ లో బాలయ్య

bala-raviబాలకృష్ణ 102వ సినిమాపై క్లారిటీ వచ్చింది. ఇప్పటికే 101వ సినిమాతో మంచి దూకుడుమీదున్న బాలయ్య… తన నెక్స్ట్ సినిమాకి కూడా ఓకే చెప్పారు. తమిళ దర్శకుడు కె.ఎస్.రవికుమార్‌ ఈ చిత్రానికి దర్శకుడు. సి.కె. ఎంటర్‌టైనమెంట్స్‌ ప్రై.లిమిటెడ్‌ పతాకంపై సి. కల్యాణ్‌ ఈ సినిమా నిర్మించనున్నారు. జూన్ నెలాఖరున సినిమా ప్రారంభమవుతుందని.. జూలై 10న సినిమా రెగ్యులర్ షూటింగ్ ఉంటుందని తెలిపారు కల్యాణ్. ఈ సినిమాకి ఎం.రత్నం అద్భుతమైన కథ, మాటలు అందించారు. సినిమాలో నటించే మిగిలిన నటీనటులు వివరాలు త్వరలో వెల్లడిస్తామని తెలిపారు కల్యాణ్.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy