కేజీలొద్దు.. ఒక్క మామిడి చాలు!

Mangoఅసలే సమ్మర్..మార్కెట్లో మామిడి పండ్లు…సీజన్ మారితే మళ్ళీ దొరకవు. జనరల్ గా మామిడి పళ్ళంటే ఇష్టం లేని వారు ఎవరూ ఉండరు. అందుకే సమ్మర్ లో ఎవర్ని చూసినా కేజీలకు కేజీలు మామిడి పళ్ళు కొనుక్కుని పట్టుకెళుతుంటారు. కానీ గుజరాత్ వెళ్తే మాత్రం ఒక పండు చాలంటారు.పైగా ఒక మామిడి కాయ తింటే చాలా గొప్ప అంటారు. అందేంటీ అనుకుంటున్నారా…ఎందుకంటే అక్కడ ఒక్కో మామిడి పండు 2 కేజీల బరువు ఉంటుంది మరి.
గుజరాత్ రాష్ట్రంలోని వడోదర జిల్లాలోని షినోర్ గ్రామంలో మామిడి తోటల్లో పళ్ళు ఒక్కోటీ రెండేసి కేజీల బరువు తూగుతున్నాయి. పొరపాటున అక్కడ వ్యాపారులను కేజీ మామిడి పండ్లు ఇవ్వండి అని అడక్కూడదో. అలా అడిగారో ఏ ఉరు బాబూ నీది అని ఎగతాళి చేస్తారు.ఎందుకంటే అక్కడ మామిడి కేజీల లెక్నుంకన కొనరు. ఒక పండు లేదా అరపండు లెక్చికన కొనుక్కుని వెళుతుంటారు.ఫ్యామిలీ మొత్తానికి కూడా ఒక్క పండు సరిపోతుంది. నర్మాదా నదీ తీరంలో రైతులు, సైంటిస్టులు కలిసి ఈ రెండు కేజీల మామిడి పళ్ళను పండించారు.ఈ మామిడి పండ్లు హైబ్రిడ్ వి కావు. ఆర్టిఫిషయల్ ఎరువులతో కాయించినవి అంత కంటే కాదు. సహజంగా…సహజమైన పద్ధతుల్లోనే కాయలు కాసేటట్లు చేశారు.
ప్రస్తుతం ఇక్బాల్ కోకుర్ అనే రైతు తోటలో ఈ పండ్లు పండాయి. నర్మదా నదీతీరంలో రెండు చెట్లలో ఇలాంటి చెట్లు వేస్తే ప్రస్తుతానికి ఒక చోట మాత్రమే కాయలు వచ్చాయి.రీసెంట్ గా ఈ రెండు కేజీల మామిడి పండ్లతో ఒక ఫెస్టివల్ ను కూడా ఏర్పాటు చేశారు ఇక్కడ రైతులు. ఆ ఫెస్టివల్ కు వచ్చిన పశుసంవర్ధక శాఖకు చెందిన అధికారి ఒకరు వీటిని గమనించి దేశంలోనే ఇవే చాలా పెద్ద మామిడి పండ్లని డిక్లేర్ చేశారు కూడా. తాను ఇప్పటి వరకూ రాజాపురి మామాడి పండ్లనే పెద్దవిగా అనుకునేవాడినని, వాటి కంటే ఇవి నాలుగు రెట్లు పెద్దవని సర్టిఫై చేశారు.

 

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy