కేజ్రీవాల్ కు షాకిచ్చిన ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్

najeebDDCA(ఢిల్లీ డిస్ట్రిక్ట్  క్రికెట్ అసోషియేషన్) ఇష్యూలో కొత్త ట్విస్ట్ ఇచ్చారు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్. సీఎం అరవింద్ కేజ్రీవాల్ వేసిన ఇండిపెండెంట్ ఎంక్వైరీ కమిటీ నియామకం చెల్లదని తేల్చేశారు. దీనిపై కేంద్ర హోంశాఖకు లెఫ్టినెంట్ గవర్నర్ లెటర్ రాశారు. 1952 కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ చట్టం ప్రకారం… కేంద్రానికి గానీ, రాష్ట్రానికి గానీ ఎంక్వైరీ కమిషన్ లను వేసే అధికారం ఉంటుందన్నారు నజీబ్ జంగ్. కేంద్ర పాలిత ప్రాంతమైన ఢిల్లీలో… ఆ అధికారాలు ఉమ్మడిగా తీసుకోవాల్సి ఉంటుందన్నారు. లెఫ్టినెంట్ గవర్నర్ లెటర్ పై సీరియస్ గా స్పందించారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. కేంద్రానికి రాసిన లేఖను మీడియాకు లీక్ చేయడంపై ఫైరయ్యారు. CBI, ED, DRI దాడులకు కూడా తమ ప్రభుత్వం భయపడడం లేదన్నారు. కానీ ఎంక్వైరీ కమిషన్ కు ఎందుకు భయపడుతున్నారని  బీజేపీ నేతలను ప్రశ్నించారు.

ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ –DDCA అధ్యక్షుడిగా జైట్లీ ఉన్న సమయంలో… అవినీతి జరిగిందని ఆప్ నేతలు ఆరోపిస్తున్నారు. ఇదే విషయంలో సొంత పార్టీ ఎంపీ కీర్తీ ఆజాద్ ని సస్పండ్ చేసింది బీజేపీ. దీంతో… బీజేపీ – ఆప్ నేతల మధ్య డైలాగ్ వార్ కంటిన్యూ అవుతోంది. ఈ మ్యాటర్ ను ఇప్పుడు కొత్త మలుపు తిప్పారు లెఫ్టినెంట్ గవర్నర్.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy