కేటీఆర్‌కు మరో ప్రతిష్టాత్మక ఆహ్వానం

KTR-4తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కు మరొక ప్రతిష్టాత్మకమైన ఆహ్వానం లభించింది. అబుదాబి భారత రాయబార కార్యాలయం, దుబాయ్, యూఏఈ లోని ప్రముఖ పారిశ్రామిక సంఘం అయిన బిజినెస్ లీడర్స్ ఫోరమ్ నిర్వహించనున్న ఇండియా-యూఏఈ భాగస్వామ్య సదస్సుకు ఆహ్వానం లభించింది. ఈ సమావేశంలో భారతదేశంతోపాటు గల్ప్ లోని ప్రముఖ పారిశ్రామికవేత్తలు, అధికారులు, పెట్టుబడిదారులు, విద్యావేత్తలు సుమారు ఎనిమిది వందలకుపైగా పాల్గోననున్నారు. దుబాయ్, యూఏఈ దేశాలతో భారత దేశ వాణిజ్య వ్యాపార సంబంధాలను మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ సమావేశం నిర్వహిస్తున్నట్లు భారత రాయబార కార్యాలయం తెలిపింది.

ఈ నెల 30,31 తేదిల్లో ఈ సమావేశం దుబాయ్‌లో జరగనున్నది. 30న జరిగే మంత్రుల స్ధాయి సెషన్‌లో పాల్గోనాల్సిందిగా మంత్రిని నిర్వహాకులు కోరారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మద్య ఉండాల్సిన వ్యూహాత్మక వ్యాపార భాగస్వామ్యం, పెట్టుబడులు, పాలసీలు, టూరిజం వంటి అంశాలపైన మాట్లాడాల్సిందిగా కోరారు. దీంతోపాటు తెలంగాణలోని ఉన్న పెట్టుబడులు అవకాశాల, ప్రభుత్వ పారిశ్రామిక పాలసీలపైన కేటీఆర్ ప్రసంగించనున్నారు. ఇప్పటికే ఈ సమావేశంలో పాల్గోనాల్సిందిగా బిజినెస్ లీడర్స్ పోరమ్ మంత్రికి అహ్వానం పంపింది.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy