కేటీఆర్ చొరవతో: గల్ప్ బాధితులు.. ఇరాక్ నుంచి స్వదేశానికి

gulf-peopleగల్ప్ లో దేశాలకు వలసలు వెళ్లి ముప్పతిప్పలు పడుతున్న తెలంగాణ బాధితులను స్వదేశానికి రప్పించింది తెలంగాణ సర్కార్. రెండేళ్లపాటు గల్ప్ లో బందీగా ఉన్న 31 మంది తెలంగాణ వలస కార్మికులు ఇవాళ (ఏప్రిల్ 3)  ఢిల్లీకి చేరుకున్నారు. ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఏయిర్ పోర్ట్  నుంచి బాధితులను నేరుగా తెలంగాణ భవన్ కు తరలించారు. ఢీల్లీకి చేరుకోగానే.. ఊపిరి పీల్చుకున్నారు వీళ్లంతా. వేయి కళ్లతో బాధితుల కుటుంబాలు ఎదురు చూస్తున్నాయి.  ఇవాళ సాయంత్రం తెలంగాణ  ఎక్స్ ప్రెస్ రైళ్లే గల్ఫ్ బాధితులను  హైదరాబాద్ కు తరలించనున్నట్టు ఢిల్లీలోని తెలంగాణ భవన్  అధికారులు తెలిపారు.

గల్ప్ బాధితుల్లో ఎక్కువగా మంచిర్యాల, కరీంనగర్, జగిత్యాల, సిరిసిల్ల జిల్లాలకు చెందిన వాళ్లే ఎక్కువగా ఉన్నారు. మంత్రి కేటీఆర్ చొరవ తీసుకొని ఢిల్లీలో కేంద్రమంత్రులతో ఇరాక్ బాధితులగురించి వివరించి.. వారిని స్వస్థలాలకు తీసుకువచ్చే విధంగా ఏర్పాటు చేశారు మంత్రి.

దుబాయ్ లోని భారత్ ఎంబసీ అధికారుల సహకారంతో ఇరాక్ నుంచి దుబాయ్ కి..అక్కడ నుంచినుంచి మళ్లీ ఢిళ్లీకి తీసుకొచ్చేలా ఏర్పాటు చేసింది విదేశీ మంత్రిత్వశాఖ. ఏజెంట్ల  మోసాలకు మోసపోయామన్నారు బాధితులు. ఇరాక్ లో ఎప్పుడు ఎక్కడ బాంబులు, తుపాకులు పేలుతాయో తెలియదన్నారు. ఇరాక్ లో 24 గంటలూ యుద్ద వాతావరణాన్ని తలపిస్తుందన్నారు గల్ఫ్ బాధితులు.

 

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy