కేటీఆర్ హైదరాబాద్ డ్రీమ్స్

ktr HYD2ఇప్పుడు రాజకీయాల్లో సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ యువ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు. అటు ఢిల్లీలో అవార్డులు అందుకుంటూ… ఇటు హైదరాబాద్ గల్లీల్లో బిజీ బిజీగా ఉన్నారు కేటీఆర్. ఈ మధ్యకాలంలో కేటీఆర్ హైదరాబాద్ అభివృద్ధిపైనే దృష్టిపెట్టారు. ఎందుకు ఈ కాన్సంట్రేషన్… జీహెచ్ఎంసీ ఎలక్షన్లేనా… ఇంకేమైనా అంతకంటే పెద్దదా… బంగారు తెలంగాణ నిర్మాణంపై సర్కార్ విజన్ ఏంటి… విశ్వనగరంపై సీఎం ఆలోచనలేంటీ ఈ అంశాలన్నింటిపై ఐటీ, పంచాయత్ రాజ్ మంత్రి కె.తారకరామారావు అభిప్రాయాలు ఎలా ఉన్నాయి..?  వీసిక్స్ తో చిట్ చాట్ సందర్భంగా వాటిల్లో ముఖ్యాంశాలు మీకోసం…

 

ఇప్పటి వరకు ప్లాన్స్… ఇకపై యాక్షన్

 • ఏడాదిన్నరగా ప్రణాళికలు పక్కాగా రూపొందిస్తూ వచ్చాం
 • ఇకపై వాటిని అమలు కోసం శ్రమిస్తాం
 • అభివృద్ధి సాధించే వరకు పని చేస్తూనే ఉంటాం
 • ఐటీ పెట్టుబడులు వ్యక్తుల వల్ల కాదు హైదరాబాద్ పరిస్థితుల వల్లే వస్తున్నాయి
 • స్టార్టప్ లలో పదిశాతం సక్సెస్ అయినా వేలాది జాబ్స్ వస్తాయి
 • హైదరాబాద్ కు సర్విస్ కంపెనీలు వచ్చాయిగానీ ఉత్పత్తి కంపెనీలు రాలేదు
 • ఐటీఐఆర్ కు సాయం చేసే ఆలోచన కేంద్రానికి లేదు
 • కేంద్రంతోసంబంధం లేకుండానే ఐటీని అభివృద్ధి చేస్తున్నాం

 

ఊపర్ షేర్వానీ – అందర్ పరేషానీ

 • హైదరాబాద్ పరిస్థితి ఊపర్ షేర్వానీ, అందర్ పరేషానీ
 • ప్రజల జీవన ప్రమాణాలు పెంచడమే విశ్వనగరం లక్ష్యం
 • సిటీలో నిరంతర విద్యుత్ ఇవ్వడమే మా పెద్ద విజయం
 • రాష్ట్ర విభజనపై చెప్పిన భయాల్లో ఒక్కటైనా నిజమైందా?
 • రాష్ట్ర మంత్రులుగా ఉన్నవాళ్లు రాష్ట్రంలో ఎక్కడైనా పనిచేయచ్చు
 • హైదరాబాద్ ఎన్నికలున్నప్పుడు మేం ప్రజల్లోకి వెళుతుంటే తప్పేంటి?
 • రోడ్లపై గుంతలు పూడ్చడం ఎన్నికల కోసం కాదు, ఎప్పుడూ జరిగేదే
 • చేయకపోతే చేయలేదంటారు చేస్తుంటే ఎన్నికల కోసం అంటారు

 

 మోడీపై వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నా…

 • ప్రధాని మోడీపై చేసిన విమర్శల్లో ఒక్కటైనా తప్పుందా?
 • పీఎం ఎవరున్నా రాష్ట్ర వాటా తెచ్చుకునే హక్కు మనకుంది
 • ఆంధ్రాకు కూడా మట్టి – నీళ్లు తప్ప ఏమీ ఇవ్వలేదు
 • మోడీ విదేశాంగ మంత్రికి ఎక్కువ ప్రధానికి తక్కువ
 • రాష్ట్రాలకు వస్తే ప్యాకేజీలు అడుగుతారని పీఎం భయపడుతున్నారు

 

నాకు మంత్రి పదవే ఎక్కువ.. ఇక సీఎం పదవా..

 • నా స్థాయికి మంత్రి పదవే ఎక్కువ, ఇంత కంటే ఎక్కువ ఆశించట్లేదు
 • వార్తలు నింపుకోవడానికే హరీష్ తో విభేదాలంటూ ప్రచారం చేస్తున్నారు
 • బీజేపీతో మాకు పంచాయితీ లేదు దోస్తానా లేదు
 • రెండు రాష్ట్రాలుగా ఉన్నా ప్రజా ప్రయోజనాలే ముఖ్యం

Comments are closed.

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy