కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ రెడ్ కార్పెట్ పై దేవకన్యలా ఐశ్వర్యరాయ్

AISHU71వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌ లో మాజీ మిస్ వరల్డ్ ఐశ్వర్యరాయ్ సందడి చేసింది. రెడ్ కార్పెట్ పై ఐశ్వర్యరాయ్ రాక కోసం కోసం అంతర్జాతీయ మీడియా కూడా ఆసక్తిని ప్రదర్శించింది. దుబాయ్‌కి చెందిన ప్రముఖ డిజైనర్ మైకేల్‌ సింకో బటర్ ఫ్లై డిజైన్‌ తో తయారుచేసిన గౌను ధరించి అందరి మనసుల్ని దోచుకుంది. కూతురు ఆరాధ్య బచ్చన్ తో కలసి ఆమె ఈ వేడుకకి హాజరయింది. కూతురు ఆరాధ్యతో కలసి రెడ్ కార్పెట్ పై నడుస్తున్న ఫోటోలను ఐశ్వర్యరాయ్ తన ఇన్‌ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. 40 ఏళ్ల వయసులో కూడా ఆమె అందం ఏ మాత్రం తగ్గలేదంటూ నెటిజన్లు ఆమెను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. రెడ్ కార్పెట్ పై సడుస్తున్న సమయంలో ఆమెను చూస్తుంటే…నడిచివస్తున్న దేవకన్యలా ఉందంటూ ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఈ నెల 8న ప్రారంభమైన కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 19వరకు కొనసాగుతుంది.
POU

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy