కేబినెట్ మీటింగ్ – చర్చించే అంశాలివే

kcr in cabinetపెద్ద అజెండా. అంతకన్నా పెద్ద టార్గెట్. హామీలు, వరాలు, కేటాయింపులు. ఇలా అన్నింటిపై చర్చించనుంది రాష్ట్ర కేబినెట్. ఇవాళ ప్రత్యేకంగా సమావేశమవుతున్న మంత్రివర్గం….కీలక అంశాలపై నిర్ణయం తీసుకోనుంది. గ్రేటర్ ఎన్నికలు, కాంట్రాక్ట్ ఉద్యోగుల పర్మినెంట్…. కొత్త నియామకాలపై డిస్కస్ చేయనుంది మంత్రివర్గం.

రాష్ట్రంలో పాలనకు సంబంధించి కీలక అంశాలపై చర్చించేందుకు రాష్ట్ర కేబినెట్ ఇవాళ సమావేశమవుతోంది. ఉదయం 11 గంటలకు మొదలయ్యే భేటీలో సర్కార్ హామీలు… సీఎం వరాలు, రాష్ట్ర బడ్జెట్, GHMC ఎన్నికలు లాంటి కీలక అంశాలపై చర్చ జరగనుంది. GHMC ఎన్నికలు, రాష్ట్ర బడ్జెట్, కాంట్రాక్టు ఉద్యోగుల పర్మినెంట్ చేనే అంశాల ఆధారంగా సుదీర్ఘంగా చర్చించనుంది మంత్రివర్గం. ఇప్పటికే అన్ని శాఖల నుంచి వచ్చిన ప్రతిపాదనలను పరిశీలించి నిర్ణయం తీసుకునే చాన్సుంది. మొత్తం 38 నుంచి 40 అంశాలపై డీప్ డిస్కషన్ చేయనుంది కేబినెట్.  ఇప్పటివరకు 31 అంశాలకు సంబంధించిన ప్రతిపాదనలు వచ్చినట్టు తెలుస్తోంది. వీటితో మరో ఐదారు అంశాలుంటాయని చెబుతున్నారు అధికారులు. ఇక సమావేశంలో గ్రేటర్ ఎన్నికలపై ప్రత్యేక చర్చ జరిగే చాన్సుంది. త్వరలో జరగనున్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలుపే టార్గెట్ గా సర్కార్ వ్యూహాలు రచిస్తోంది. దీంతో సిటీ డెవలప్ మెంట్ పై కూడా కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకుంటారని తెలుస్తోంది. మరోవైపు ఉద్యోగులకు సంబంధించి ఇప్పటికే ఇచ్చిన హామీలను నెరవేర్చేలా భేటీలో నిర్ణయం తీసుకునే చాన్సుంది. కాంట్రాక్టు,  ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతాలపై కూడా డెసిషన్ ఉండే చాన్సుంది.

కీలక అంశాలపై చర్చ జరుగుతుండడంతో కేబినెట్ భేటీ సుదీర్ఘంగా జరిగే చాన్సుంది. ఉదయం 11 గంటలకు మొదలుకానున్న భేటీ సాయంత్రం 4.30 వరకు కొనసాగుతుందని తెలుస్తోంది. మధ్యాహ్నం 1.30 గంటలకు హోటల్ మారియట్ లో లంచ్ కు ఏర్పాట్లు చేశారు. మంత్రులు, సీఎస్ అన్ని శాఖల ప్రిన్సిపల్ సెక్రటరీలు, ఇతర అధికారులు అటెండ్ కానున్నారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పనుల అప్డేట్ పై కూడా చర్చించనుంది కేబినెట్. అటు ప్రాజెక్టుల రీడిజైనింగ్, నిధుల కేటాయింపుపై చర్చించి డెసిషన్ తీసుకోనే చాన్సుంది.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy