కేరళ,కర్నాటకలో ముందస్తు వర్షాలు

Keralaకేరళ,కర్నాటక రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో వారం రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాలు మరో నెల రోజుల పాటు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ముందస్తు రుతుపవనాలు రెండు రాష్ట్రాలను తాకడంతో ఈ వర్షాలు కురుస్తున్నయని వాతావరణ శాఖ తెలిపింది. మే 27న రుతుపవనాలు రావాల్సి ఉంది. అయితే అవి ముందుగానే ఆ రెండు రాష్ట్రాలను తాకాయి.

గతేడాది కేరళలో వర్షాలు సాధారణ స్థాయి కంటే 34 శాతం తక్కువగా నమోదయ్యాయి. అయితే ఈ ఏడాది కేరళలో రుతుపవనాలు ముందస్తుగానే రావడం శుభపరిణామం అంటున్నారు వాతావరణ శాఖ అధికారులు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy