కేరళకు ఈ సాయంత్రం మోడీ పయనం

భారీవర్షాలు, వరదలతో ఉక్కిరిబిక్కిరవుతున్న కేరళ రాష్ట్రానికి ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఈ సాయంత్రం పొద్దుపోయాక వెళ్తారు. సాయంత్రం స్మృతిస్థల్ లో మాజీ ప్రధానమంత్రి వాజ్ పేయి అంత్యక్రియలకు హాజరైన తర్వాత.. మోడీ కేరళకు వెళ్తారు. ఈ ఉదయం కేరళ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ తో ప్రధానమంత్రి ఫోన్ లో మాట్లాడారు. వర్షాలు, వరద పరిస్థితిపై మాట్లాడారు. అందుతున్న సహాయ కార్యక్రమాలపై డిస్కస్ చేశారు. కేరళలో వరద పరిస్థితిని పరిశీలించేందుకు వెళ్లనున్నట్టు ప్రధాని ట్వీట్ చేశారు.

మరోపక్క.. కేరళలోని 13 జిల్లాల్లో రెడ్ అలర్ట్ కొనసాగుతోంది. ఇప్పటివరకు 94 మంది మృతి చెందినట్లు అధికారులు చెప్పారు. ఆగస్టు 8 నుంచి కేరళలో భారీ వర్షాలు పడుతున్నాయి. ఎడతెగని వర్షాలతో వరదలు వచ్చాయి. నదులు పొంగిపొర్లుతుండటంతో కేరళ చరిత్రలోనే మొదటిసారిగా.. అన్ని వాటర్ ప్రాజెక్టుల గేట్లు ఎత్తి నీటికి దిగువకు విడుదల చేస్తున్నారు.

మరో రెండు రోజుల పాటు ఇలాగే భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ సాయంత్రం సీఎం, అధికారులతో మాట్లాడి.. రేపు కేరళలోనే ఉండి వరద పరిస్థితి పరిశీలిస్తారు ప్రధానమంత్రి. వాతావరణ అనుకూలను బట్టి… వరద ముంపు ప్రాంతాల్లో ప్రధానమంత్రి ఏరియల్ సర్వే చేసే అవకాశముంది.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy