కేరళకు చిరు ఫ్యామిలీ విరాళం

కేరళ వరద బాధితులకు తమవంతు సాయం చేసేందుకు ముందుకువస్తున్నారు సినీ హీరోలు. ఇప్పటికే దేశంలోని పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు విరాళాలు అందించగా..శనివారం మెగా ఫ్యామిలీ సాయం ప్రకటించింది. మెగాస్టార్ చిరంజీవి,రామ్‌ చరణ్ రూ. 25 లక్షల సాయం ప్రకటిస్తున్నట్లు తెలిపారు. అలాగే చిరంజీవి తల్లి అంజనాదేవి రూ. లక్ష ఇస్తున్నట్లు తెలుపగా, రామ్ చరణ్ భార్య ఉపాసన రూ. 10 లక్షల విలువైన మందులను విరాళంగా ప్రకటించారు.

హీరో అల్లు అర్జున్‌ రూ.25 లక్షలు కేరళ ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించారు.
హీరో విజయ్‌ దేవరకొండ రూ.5 లక్షలు విరాళం ఇచ్చారు. గీత గోవిందం సినిమా వసూళ్లను కేరళ ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళంగా అందిస్తామని సినిమా నిర్మాత బన్నీ వాసు తెలిపారు.

వీరితో పాటు..శనివారం (ఆగస్టు-18) హైదరాబాద్, ఫిలింఛాంబర్‌ లో మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ సమావేశమై ‘మా’ తరుఫున కేరళకు రూ. 10 లక్షల వరదసాయం ప్రకటించింది. హీరోల మద్దతు లేకుండా తామేమి చేయలేమని తెలిపారు ‘మా’ అధ్యక్షుడు శివాజీరాజా. ‘మా’ కు హీరోలే వెన్నెముకని పరుచూరి వెంకటేశ్వరరావు అన్నారు. చిరంజీవి కుటుంబం స్పందించడం ఆనందంగా ఉందన్నారు. మరింతమంది హీరోలు కేరళ వరద బాధితులకు సాయం అందించేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy