కేరళకు రూ.100 కోట్లు తక్షణ సాయం : రాజ్ నాధ్

భారీ వర్షాలతో కేరళ కేరళ అతలాకుతమైంది. కేరళలోని ఇడుక్కి రిజర్వాయర్ పొంగిపొర్లడంతో 37 మంది మరణించారు. 35,000 మంది పునరావాస శిబిరాలకు తరలిపోవాల్సి వచ్చింది. కేరళను ఆదివారం (ఆగస్టు-12) కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన తక్షణ సాయంగా రూ.100 కోట్లు విడుదల చేస్తున్నట్లు తెలిపారు. కేరళ ప్రజల ఈ వివత్కర పరిస్థితిని నేను అర్థం చేసుకోగలను. ఎంతో నష్టం జరిగింది. దీని నుంచి బయటపడటానికి కొంత సమయం పడుతుంది. అందుకే తక్షణ సాయంగా కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.100 కోట్ల రూపాయలు విడుదల చేస్తున్నాం అని ట్వీట్ చేశారు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy