కేరళలో తాగేందుకు నీరు కూడా దొరకడం లేదు : పిన్నరయి విజయన్

ఓ వైపు కుండపోత వాన.. మరోవైపు అడుగులోతు వరద.. ఎటూ వెళ్లలేని పరిస్థితి. ిీి. ఇది కేరళలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితి. ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయకచర్యల్లో పాల్గొంటున్నా.. ప్రజల కష్టాలు తీరడం లేదు. అటు.. కర్ణాటకలోనూ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి.
కేరళను వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. పది రోజులుగా కురుస్తున్న వర్షాలతో రాష్ట్రంలోని 7 జిల్లాలు వరదలో చిక్కుకున్నాయి. ఇప్పుడు మరో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు పడే అవకాశముందని వాతావరణశాఖ హెచ్చరించింది. దీంతో రాష్ట్రంలో రెడ్ అలర్ట్ ప్రకటించారు. భారీగా వర్షపు నీరు చేరుకోవడంతో కొచ్చి ఎయిర్ పోర్టును ఈ నెల 18 వరకు మూసివేస్తున్నట్టు ప్రకటించారు. వరద ప్రభావిత జిల్లాల్లో వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ లు బురదనీటితో నిండిపోయాయని.. తాగేందుకు నీరు కూడా దొరకడం లేదని చెప్పారు సీఎం పినరయి విజయన్. ప్రజలకు మంచినీరు అందించేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు.
కొచ్చి మరోసారి జలదిగ్భంధంలో చిక్కుకుంది. లోతట్టు ప్రాంతాలు నీటమునిగిపోయాయి. ఇళ్లలో రెండుమూడు అడుగుల మేర నీరు నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్,పోలీసు సిబ్బంది ప్రజలను సహాయకకేంద్రాలకు తరలిస్తున్నారు. పాలక్కడ్ లోనూ ఇదే పరిస్థితి కొనసాగుతోంది. మలమ్ పుజా డ్యాం రెండు గేట్లు ఎత్తివేత నీరు విడుదల చేశారు. చాలా ప్రాంతాలు వరద ముంపులో ఉండటంతో.. సహాయకచర్యల కోసం మరో నాలుగు ఎన్డీఆర్ఎఫ్ బలగాలను రప్పించారు.
భారీ వర్షాలకు కర్ణాటకకు కష్టాలు మొదలయ్యాయి. మైసూర్ లోని లోతట్టు ప్రాంతాలు నీటిలో మునిగిపోయాయి. పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. పరిస్థితిపై సీఎం కుమారస్వామి రివ్యూ చేశారు. అప్రమత్తంగా ఉండాలని కొడగు, హస్సన్, చిక్కమగలూరు, శివమొగ్గ జిల్లా కలెక్టర్లకు ఆదేశాలిచ్చారు. మరోవైపు.. కేరళ వెళ్లే బస్సు సర్వీసులు రద్దు చేసింది కర్ణాటక.
భారీ వర్షాలకు కర్ణాటకలోని జోగ్ జలపాతం కనులవిందు చేస్తోంది. ఎత్తైన కొండల నుంచి జారి పడుతున్న నీరు.. చుట్టూ పచ్చని చెట్లతో వాతావరణం అహ్లాదకరంగా మారింది. అటు.. భద్రానదికి వరదపోటెత్తడంతో.. దిగువన ఉన్న డ్యాం నిండుకుండలా మారింది. దీంతో డ్యాం నుంచి నీటిని విడుదల చేస్తున్నారు.
హిమాచల్ ప్రదేశ్ లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. చంబా ఏరియాలో కొండపై నుంచి భారీ మట్టి దిబ్బ కూలిపోయింది. పక్కనే ఉన్న ఇళ్లు, పటాన్ కోట్ హైవేపై మట్టి, రాళ్లు పడిపోయాయి. దీంతో పటాన్ కోట్ హైవే పై వాహనాల రాకపోకలను ఆపేశారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy