కేరళలో మరో మాంఝీ

kerala-man-digs-roadబీహార్ లో మాంఝీని చూశాం.. కొండను తవ్వి.. రోడ్డు మార్గం వేసేశాడు. ఇప్పుడు అలాంటి వ్యక్తే.. కేరళలో కనిపిస్తున్నారు. మూడేళ్లు శ్రమించి ఊరికి రోడ్డేశారు. అదీ పక్షవాతాన్ని సహితం లెక్క చేయకుండా. ఈ ఫొటోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు జి.శశి. వయస్సు 59 ఏళ్లు. కేరళలోని మారుమూల ప్రాంతం. 18 ఏళ్ల క్రితం కొబ్బరి చెట్టుపై నుంచి పడిపోయాడు. దీంతో కుడివైపు పక్షవాతం సోకింది. అయితే అతను అలాగే కూర్చో లేదు. ఏదో ఒకటి చేసుకుంటూ కాలం గడిపేశాడు. మూడేళ్ల క్రితం సడెన్ గా ఓ ఆలోచన వచ్చింది. ట్రైసైకిల్ ఉంటే.. ఏదైనా చిన్న షాప్ పెట్టకుందామనుకున్నాడు. పక్షవాతం వచ్చిన తనకు ట్రై సైకిల్ ఇప్పించమని గ్రామ పంచాయతీకి అర్జీ కూడా పెట్టేసుకున్నాడు. అయితే దీనిపై ఎలాంటి హామీ ఇవ్వలేదు సరికదా… దానిగురించి పట్టించుకున్న వాళ్లే లేరు. శశి అలాగే కూర్చోలేదు. ఒకవేళ తనకు ట్రై సైకిల్ వస్తే.. దాన్ని నడపడానికి రోడ్డు మార్గం లేదని గుర్తించిన ఆయన.. చేసేది లేక.. తనే పలుగు పారా పట్టుకుని రోడ్డు వేయడం ప్రారంభించాడు. అలా మూడేళ్లు కష్టపడి రోడ్డు పూర్తి చేశాడు. ఇక అందరూ మెచ్చుకోవడం ప్రారంభించాడు. ఇదిలా ఉంటే… ఇప్పటికైనా తనకు ట్రైసైకిల్ ఇస్తారా లేదా అన్న అనుమానం మాంఝీని వెంటాడుతుంది.

One Response to కేరళలో మరో మాంఝీ

  1. Anonymous says:

    Me channel nundi provide cheyochu kada

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy